Share News

మేధోసంపత్తితో వ్యాపార రంగంలో కొత్త ఆవిష్కరణలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:26 AM

మేధోసంపత్తి ద్వారా వ్యాపార రం గంలో కొత్త ఆవి ష్కరణలు చేయవచ్చునని జిల్లా పరిశ్రమల కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కేశం వేణు అన్నారు.

మేధోసంపత్తితో వ్యాపార రంగంలో   కొత్త ఆవిష్కరణలు

మేధోసంపత్తితో వ్యాపార రంగంలో

కొత్త ఆవిష్కరణలు

వన్‌టౌన్‌: మేధోసంపత్తి ద్వారా వ్యాపార రం గంలో కొత్త ఆవి ష్కరణలు చేయవచ్చునని జిల్లా పరిశ్రమల కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కేశం వేణు అన్నారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం ఎంట్రప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ప్రపంచ మేథోసంపత్తి హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామిక కార్యకలపాలపై సెమినార్‌ నిర్వ హించారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మేథోసంపత్తి హక్కుల ప్రాముఖ్యతను, అది ఎలా ఉపయోగ పడుతుందన్న దానిపై సోదాహరణంగా వివరించారు. విభాగా ధిపతి డాక్టర్‌ ఏ.రమాదేవి, అడ్మిన్‌ డీన్‌, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్‌ విజయదుర్గాప్రసాద్‌, ఈడీసీ కన్వీనర్‌ వై.సుధాచంద్ర పాల్గొన్నారు. ఆయనకు జ్ఞాపికను అందజేసి సత్కరించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:26 AM