Share News

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:31 AM

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు.

పారిశుధ్య నిర్వహణలో   అలసత్వం వహిస్తే చర్యలు

పారిశుధ్య నిర్వహణలో

అలసత్వం వహిస్తే చర్యలు

సత్యనారాయణపురం, జనవరి 29: పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు. 30వ డివిజన్‌ రామకృష్ణాపురంలో సోమవారం నగరపాలక సంస్థ అధికారుల, స్థానిక కార్పొరేటర్‌ బీహెచ్‌ఎస్‌వీ జానారెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుధ్య నిర్శహణ పట్ల ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రోజు మురుగుకాల్వలు శుభ్రం చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిచారు. మలేరియా విభాగం సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల నివారణ చర్యల వివరాల రికార్డులు పరిశీలించారు. కార్పొరేటర్‌ జానారెడ్డి మాట్లాడుతూ ఏలూరు కాల్వలో, బుడమేరులో దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. నగరపాలక సంస్థ డిఈ గుర్నాధం, సీఎంహెచ్‌వో డా. రత్నావళి, మలేరియా, పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:32 AM