Share News

ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఎన్‌సీసీ కోటా అమలు

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:45 AM

విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేం దుకు ఎన్‌సీసీ దోహదపడు తుందని పీఐ స్టాఫ్‌ సుబేదార్‌ పాల్‌కర్‌ సంజయ్‌ అన్నారు.

ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఎన్‌సీసీ కోటా అమలు
సర్టిఫికెట్లు పొందిన కేడెట్లతో సుబేదార్‌ పాల్‌కర్‌ సంజయ్‌, ఎం.అనురాధ

ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ఎన్‌సీసీ కోటా అమలు

పీఐ స్టాఫ్‌ సుబేదార్‌ పాల్‌కర్‌ సంజయ్‌

లబ్బీపేట, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేం దుకు ఎన్‌సీసీ దోహదపడు తుందని పీఐ స్టాఫ్‌ సుబేదార్‌ పాల్‌కర్‌ సంజయ్‌ అన్నారు. నలంద కళాశాలలో బుధ వారం ఎన్‌సీసీ బి సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణులైన కేడెట్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణులైన వారు సి సర్టిఫికెట్‌ పరీక్షకు అర్హులని, ఉన్నత విద్య, ఉద్యోగాలలో ఎన్‌సీసీ కోటాను అమలు చేస్తుందని అన్నారు. ప్రిన్స్‌పాల్‌ ఎం. అనురాధ మాట్లాడుతూ 2023-2024 లో బి సర్టిఫికెట్‌ పరీక్షకు 27 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారని అన్నారు. యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌, ఐడీసీ, ఆర్‌డీసీ, తల్‌ సైనిక్‌ క్యాంపులలో పాల్గొనడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, భావవ్యక్తీకరణ, నైపుణ్యం అలవడుతుందని, దేశ, విదేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అనేక విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఏఎన్‌వో కె. సుధాకర్‌, కేడెట్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 12:45 AM