Share News

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే త్వరితగతిన అమరావతి నిర్మాణం: గద్దె అనురాధ

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:08 AM

‘‘అమరావతి రాజధాని నిర్వీర్యంతో కళకళలాడే విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తారు. ప్రజల ఆస్తులను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకునేందుకు జగన్మోహన్‌రెడ్డి భూ రక్షణ చట్టం తెచ్చారు. కూటమి ప్రభుత్వ మొచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తాం.’’ అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ తెలిపారు.

 చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే త్వరితగతిన అమరావతి నిర్మాణం: గద్దె అనురాధ
10వ డివిజన్‌లో ప్రచారం చేస్తున్న గద్దె అనురాధ

పటమట, ఏప్రిల్‌ 7: ‘‘అమరావతి రాజధాని నిర్వీర్యంతో కళకళలాడే విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తారు. ప్రజల ఆస్తులను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకునేందుకు జగన్మోహన్‌రెడ్డి భూ రక్షణ చట్టం తెచ్చారు. కూటమి ప్రభుత్వ మొచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తాం.’’ అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ తెలిపారు. ఆదివారం 10వ డివిజన్‌ కేపీ నగర్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్‌, కేశినేని శివనాథ్‌(చిన్ని)లను గెలిపించాలని కోరుతూ ఆమె ప్రచారం చేశారు. జగన్‌ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లగొట్టాడని, చంద్రబాబు తన చరిష్మాతో వందలాది పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాల కల్పన చేస్తారని, సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గద్దె రామ్మోహన్‌, కేశినేని శివనాథ్‌లను గెలిపించాలని ఓటర్లను అనురాధ కోరారు. దేవినేని అపర్ణ, వల్లభనేని మాధవి, గుత్తి కొండ సుబ్బారావు, జి.నరేంద్ర, ఎం.శివరామకృష్ణ, డి.సాంబశివరావు, వి.పూర్ణచంద్ర రావు, ఎం.శ్రీనివాసరావు, సీహెచ్‌ వాసు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:08 AM