Share News

84 వేల ఇళ్లు ఇస్తే 6 వేలే కేటాయించారేంటి?

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:27 AM

ఎన్టీఆర్‌ జిల్లాకు పీఎంఏవై పథకం కింద 84వేల ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 6 వేల ఇళ్లు కేటాయించడంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ

84 వేల ఇళ్లు ఇస్తే 6 వేలే కేటాయించారేంటి?
ఉజ్వల్‌ గ్యాస్‌ కనెక్షన్లు అందిస్తున్న కేంద్రమంత్రి భారతీపవార్‌, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సంపత్‌

ఎన్టీఆర్‌ జిల్లాలో పీఎంఏవై ఇళ ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ అసంతృప్తి.. లక్ష ఇళ్లు నిర్మించాలని కలెక్టర్‌కు ఆదేశం

జగ్గయ్యపేట, జనవరి 6: ఎన్టీఆర్‌ జిల్లాకు పీఎంఏవై పథకం కింద 84వేల ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 6 వేల ఇళ్లు కేటాయించడంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి భారతీ ప్రవీణ్‌పవార్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకా నికి 9లక్షల మంది అర్హులుగా ఉంటే 31వేల మందికే కార్డులు ఇవ్వటంపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట సమీపంలోని షేర్‌మహ్మద్‌పేటలో నిర్వ హించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రలో కార్యక్ర మంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని, గ్రామాలవారీగా లక్ష్యా లను పెట్టుకుని నిర్మాణం పూర్తి చేయించాలని జిల్లా జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా స్వయం సహయక సంఘాలకు రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను జోడించేందుకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందుల పిచికారీపై స్వయం సహయక సంఘాలకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర ద్వారా కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాలో 288 పంచాయతీలకు గాను 202 పంచాయతీల్లో యాత్ర పూర్తి చేసినట్టు చెప్పారు.

కేన్సర్‌ రోగులకు ఫించన్‌ ఇప్పించండి

ప్రధాని మోదీకి చెప్పి కేన్సర్‌ రోగులకు ఫించన్‌ ఇప్పించాలని మంత్రిని షేర్‌ మహ్మద్‌పేట గ్రామానికి చెందిన ఫర్జానా అనే మహిళ కోరింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద తనకు థైరాయిడ్‌ కేన్సర్‌ ఆపరేషన్‌, తన సోదరుడికి నరాల బలహీనతకు చికిత్స చేయించుకుని కోలుకున్నామని, ఆపరేషన్‌ తర్వాత గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నామని ఫించన్‌ రూపంలో ఆర్థిక సాయం ఇప్పించాలని మంత్రిని కోరారు. మూడు జిల్లాల్లో 1600 మంది టీబీ రోగులకు పోషకాహారాన్ని అందిస్తున్న కోహాన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెని ప్రతినిధి మూర్తిని కేంద్ర మంత్రి అభినందించి, సత్కరించారు. ఉజ్వల పదకం కింద లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు అందచేశారు. అంతకు ముందు వివిధ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వయంసహయక సంఘాల సభ్యులు ఇచ్చిన గాజులు, స్వీట్లు, నూతన వస్త్రాలను స్వీకరించారు. స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సంపత్‌, డీపీవో జయచంద్ర, డీఎం హెచ్‌వో సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:27 AM