Share News

హైందవ శంఖారావం జయప్రదం చేయండి

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:58 AM

హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి కల్పించాలన్న డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పిలుపునిచ్చారు.

హైందవ శంఖారావం జయప్రదం చేయండి
హైందవ శంఖారావం కార్యక్రమ కరపత్రాలను విడుదల చేస్తున్న బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, వీహెచ్‌పీ నేతలు

బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పిలుపు

వన్‌టౌన్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి కల్పించాలన్న డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం ప్రచా ర వాహనాలకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కరపత్రాలను విడుదల చేశారు. ప్రతి హిందువు హైందవ శం ఖారావం సభకు హాజరుకావాలని, ఆలయాల వ్యవస్థను రక్షించుకునేందు కు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అమానుషంగా ప్రవర్తించారన్నారు. దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీని పూర్తిగా తొలగించాలని వీహెచ్‌పీ సహాయ కార్యదర్శి కొంపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 12:58 AM