Share News

ఈదురు గాలులతో భారీ వర్షం

ABN , Publish Date - May 25 , 2024 | 12:27 AM

జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురవటంతో 6గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఈదురు గాలులతో భారీ వర్షం
చిల్లకల్లు రోడ్డులో కరెంట్‌ తీగలపై పడిన చెట్లకొమ్మలు

జగ్గయ్యపేట, మే 24: జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురవటంతో 6గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో ఆటోనగర్‌ సబ్‌ స్టేషన్‌, చిల్లకల్లు స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా మెయిన్‌ లైన్‌లలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. ప్రధాన లైన్‌లపై అనేక చోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడటం, లైన్లు తెగిపడిపోవటంతో వాటిని సరిచేసేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది త్రీవంగా శ్రమించారు. రాత్రి 9గంటల నుంచి వారి చేసిన శ్రమ ఫలించి తెల్ల వారుజామున 3గంటలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 4.8మి.మి.ల వర్షపాతం నమోదైనట్టు తహసీల్దార్‌ జీవీ శేషు తె లిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు.

Updated Date - May 25 , 2024 | 12:27 AM