Share News

కొమ్ముకాశాడు.. దొరికిపోయాడు!

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:25 AM

ఓట్ల అక్రమాలపై చర్యలు మొదలయ్యాయి. చనిపోయిన వారి ఓట్ల గ్యాంబ్లింగ్‌కు పాల్పడిన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 30వ డివిజన్‌లోని 29వ పోలింగ్‌ బూత్‌కు చెందిన బీఎల్వో సునీల్‌ కుమార్‌పై వేటు పడింది. చనిపోయిన వాళ్లు కూడా మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అయ్యారని బూత్‌లను మార్చివేసిన బీఎల్వో సునీల్‌ కుమార్‌ వేటుకు గురి కావాల్సి వచ్చింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ వివాదాస్పద బీఎల్వోను సస్పెండ్‌ చేశారు.

కొమ్ముకాశాడు.. దొరికిపోయాడు!

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన బీఎల్వో

డెత్‌ ఓట్లు మరో డివిజన్‌కు బదిలీ

సస్పెండ్‌ చేసిన కమిషనర్‌ స్వప్నిల్‌

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ దిల్లీరావు

దేవినగర్‌లో పరిశీలించిన తహసీల్దార్‌ శంకరరావు

27 డెత్‌ ఓటర్లలో 26 మంది చనిపోయినట్టుగా నిర్ధారణ

ఓట్ల అక్రమాలపై చర్యలు మొదలయ్యాయి. చనిపోయిన వారి ఓట్ల గ్యాంబ్లింగ్‌కు పాల్పడిన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం 30వ డివిజన్‌లోని 29వ పోలింగ్‌ బూత్‌కు చెందిన బీఎల్వో సునీల్‌ కుమార్‌పై వేటు పడింది. చనిపోయిన వాళ్లు కూడా మరో ప్రాంతానికి షిఫ్ట్‌ అయ్యారని బూత్‌లను మార్చివేసిన బీఎల్వో సునీల్‌ కుమార్‌ వేటుకు గురి కావాల్సి వచ్చింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ వివాదాస్పద బీఎల్వోను సస్పెండ్‌ చేశారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ సత్యనారాయ ణపురం) : విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో దొంగ ఓట్లను చేర్చేందుకు అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడింది. టీడీపీ నేతలు ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా సూక్ష్మ పరిశీలన చేయగా.. బీఎల్వో సునీల్‌ కుమార్‌ అడ్డంగా దొరికిపోయాడు. చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినపుడు ఈ బీఎల్వో అధికార పార్టీ కొమ్ముకాశాడు. ఓట్లను ఆ బూత్‌ నుంచి తొలగించి వేరే బూత్‌లోకి షిఫ్ట్‌ చేశాడు. మొత్తం 27 మంది చనిపోయిన ఓట్లను తొలగించకుండా మరో బూత్‌కు షిఫ్ట్‌ చేశాడు. వీటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయటంతో బీఎల్వో అడ్డంగా బుక్‌ అయ్యాడు. ప్రాథమిక విచారణ చేయించిన కమిషనర్‌ స్వప్నిల్‌ బాధ్యుడైన బీఎల్వోను సస్పెండ్‌ చే శారు.

డెత్‌ ఓట్లపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో వెలుగు చూసిన డెత్‌ ఓటర్ల షిఫ్టింగ్‌ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు విచారణకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఏఈఆర్‌వోగా వ్యవహరిస్తున్న విజయవాడ నార్త్‌ మండల తహసీల్దార్‌ శంకరరావు విచారణకు వచ్చారు.

నియోజకవర్గంలోని 30వ డివిజన్‌ పరిధిలోని 29వ పోలింగ్‌ బూత్‌ ప్రాంతమైన దేవీనగర్‌లోని 6, 7 రోడ్లలో షిఫ్టింగ్‌ అయిన డెత్‌ ఓటర్ల వివరాలకు సంబంధించి విచారించారు. స్థానిక డివిజన్‌ టీడీపీ అధ్యక్షులు చౌదరి సూర్యనారాయణ, యూనిట్‌ ఇన్‌చార్జి కనకమేడల అనూరాధ, కనకమేడల కొండలరావు కూడా తహసీల్దార్‌ పర్యటనలో పాల్గొన్నారు. నవనీతం సాంబశివరావు... చనిపోయిన వారికి సంబంధించి చాలా వరకు డెత్‌ సర్టిఫికెట్లను సంప దించి వాటిని విచారణాధికారికి అందజేశారు. డెత్‌ సర్టిఫికెట్లు లేనివాటికి సంబంధించి తహసీల్దార్‌ శంకరరావు స్థానికంగా పంచనామా నిర్వహించారు. పంచానామాలో కూడా చనిపోయిన విషయం వెలుగు చూసింది. మొత్తం 27 డెత్‌ ఓట్లలో ఒక్కటి తప్ప మొత్తం చనిపోయినట్టుగా ధ్రువీకరణ అయింది.

Updated Date - Feb 12 , 2024 | 01:25 AM