Share News

హనుమంత వాహనంపై లక్ష్మీనరసింహస్వామి

ABN , Publish Date - May 23 , 2024 | 12:16 AM

వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నరసింహస్వామి దీక్షాస్వాములు ఇరుముడులు సమర్పించారు. శ్రీవారిని బుధవారం హనుమంత వాహనంపై ఊరేగించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.

 హనుమంత వాహనంపై లక్ష్మీనరసింహస్వామి

జగ్గయ్యపేట, మే 22: వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నరసింహస్వామి దీక్షాస్వాములు ఇరుముడులు సమర్పించారు. శ్రీవారిని బుధవారం హనుమంత వాహనంపై ఊరేగించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. కేసీపీ విద్యాసంస్థలు, బాలా త్రిపురసుందరీ అమ్మవారి ట్రస్టు ఆధ్వర్యంలో బ్రహ్మోత్స వాలకు హాజరయ్యే భక్తులు, దీక్షాస్వాములకు వంశ పారంపర్య ధర్మకర్త డాక్టర్‌ వెలగపుడి ఇందిరా లక్ష్మణ్‌దత్‌ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వ హించారు. కేసీపీ భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈవో ఎస్‌.హేమలతా దేవి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

పల్లగిరి గట్టుపై..

నందిగామ రూరల్‌: సత్యవరం, పల్లగిరి గట్టుపై వేంచేసియున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి నరసింహారావు, కొత్త వేణుమాధవ్‌ పర్యవేక్షణలో అర్చకులు లక్ష్మీ నరసింహ స్వామి మూలవరులకు తిరువంజనం, మూలమంత్ర హోమాది క్రతువులు, విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మక్కపేట మూడు కొండలపై ..

వత్సవాయి: మక్కపేట సమీపంలోని మూడు కొండలపై ఉన్న యోగానంద లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీట్లపై కూర్చొని కల్యాన్ని జరిపించారు. వివిధ గ్రామాల నుంచి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. దేవాలయ ఆవరణలో భారీ అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌ స్వామి కల్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు.

పెనుగొలనులో..

గంపలగూడెం: పెనుగొలను గుట్టపై వేంచేసియున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి జయంతి సందర్భంగా చందనోత్స వాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు శంకు, చక్ర, సహస్రఽధార ద్వారా పంచామృతాలు, అభిషేకాలు నిర్వహించారు. మూల విరాట్‌ విగ్రహాలకు ఉసిరి నూనె రాసి చందనంతో అలంకరించారు. ఈకార్యక్రమంలో ఆలయ కన్వీనర్‌ హరిమాధవ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:16 AM