Share News

హనుమజ్జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 26 , 2024 | 12:34 AM

స్థానిక అభ యాంజనేయస్వామి ఆల యంలో సోమవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 23వ హనుమజ్జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి అయ్యాయి. ఆల యంతో పాటు నాలుగు రోడ్లులో దారి పొడుగునా విద్యుత్‌ దీపాల తోరణా లతో అలంకరించారు. సెం టర్‌లో నాలుగు మూలల విద్యుత్‌ దీపాలతో అలంకరించిన దేవతా మూ ర్తుల భారీ కటౌట్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఆలయం వెనుక భాగంలో భారీ ఎత్తున పందిరి ఏర్పాటు చేశారు. గత ఉత్సవాల్లోనే దాతల సహకారంతో శాశ్వత క్యూలైన్‌ నిర్మించారు. జయంతి రోజున వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించనున్నారు.

  హనుమజ్జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
విద్యుత్‌ దీపాలతో అలంకరించిన అభయాంజనేయస్వామి ఆలయం.. అబ్బురపరుస్తున్న భారీ కటౌట్‌

హనుమాన్‌జంక్షన్‌, మే 25 : స్థానిక అభ యాంజనేయస్వామి ఆల యంలో సోమవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 23వ హనుమజ్జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి అయ్యాయి. ఆల యంతో పాటు నాలుగు రోడ్లులో దారి పొడుగునా విద్యుత్‌ దీపాల తోరణా లతో అలంకరించారు. సెం టర్‌లో నాలుగు మూలల విద్యుత్‌ దీపాలతో అలంకరించిన దేవతా మూ ర్తుల భారీ కటౌట్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఆలయం వెనుక భాగంలో భారీ ఎత్తున పందిరి ఏర్పాటు చేశారు. గత ఉత్సవాల్లోనే దాతల సహకారంతో శాశ్వత క్యూలైన్‌ నిర్మించారు. జయంతి రోజున వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించనున్నారు. క్యూలైన్‌లో దర్శనం చేసు కునే భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్‌పై రేకుతో పందిరి కూడా ఏర్పాటు చేశారు. గత ఉత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించగా ఈ సారి ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక పెద్దల సహకారం తీసుకొని ఉత్సవాలను ప్రారంభిం చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ శా ఖ రూ.11 లక్షలు మంజూరు చేసినట్లు ఆలయ ఈవో కె.శ్రీనివాస్‌ తెలిపా రు. దాతలు కూడా విరాళాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాతల నుంచి రూ.50వేలు ఉత్సవ నిర్వహణ, ప్రసాదాలు ఖర్చులకు వచ్చి నట్లు తెలిపారు. ఉత్సవాలు సందర్భంగా ప్రతి రోజు స్వామి వారికి జరిపే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.

Updated Date - May 26 , 2024 | 12:34 AM