Share News

గులకరాయి గాయంపై వాపోతున్నారు.. చేసిన అరాచకాలు మర్చిపోయారా?

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:24 AM

‘ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘోరాలెన్ని? తగిలిన గాయాలెన్ని? పోయిన ప్రాణా లెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాం డ్‌ చేశారు.

గులకరాయి గాయంపై వాపోతున్నారు..  చేసిన అరాచకాలు మర్చిపోయారా?

జగన్‌కు దేవినేని ఉమా ప్రశ్న

గొల్లపూడి, ఏప్రిల్‌ 19: ‘‘ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘోరాలెన్ని? తగిలిన గాయాలెన్ని? పోయిన ప్రాణా లెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాం డ్‌ చేశారు. గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నడిరోడ్డుపై నరికివేతలు జరగలేదా? దళితుడిని చంపేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేయలేదా? ప్రజా ప్రతినిధులపై పట్టపగలే కర్ర లతో దాడులు చేయలేదా? ఇళ్లపై మూకలు పడి విధ్వం సాలు చేయలేదా? అవన్నీ మరిచిపోయారా? ఇన్ని అరాచకాలు చేసింది మీరు కాదా వీటిపై ఎప్పుడైనా స్పందించారా?’’ అని జగన్‌ను ఆయన నిలదీశారు. ‘‘చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేస్తే చర్యలు లేవు. అంగళ్లులో జడ్‌ ప్లస్‌ సెక్కూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడిచేసి రివర్స్‌లో తప్పుడు కేసులు పెట్టారు. గులకరాయి డ్రామా కేసుపై పెట్టిన శ్రద్ధ మిగి లిన వాటిపై ఎందుకు పెట్టలేదు.’’ అని జగన్‌ను ఉమా నిలదీశారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్‌కు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లు గడిచినా మద్య నిషేధం ఊసే లేదన్నారు. ఐదేళ్లలో లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన ఆరోపించారు.

Updated Date - Apr 20 , 2024 | 01:24 AM