Share News

తాగునీటి సమస్య పరిష్కరించలేని ప్రభుత్వమిది: కాగిత కృష్ణప్రసాద్‌

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:19 AM

‘‘తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతున్నారు. దోచుకోవడం తప్ప దాహం తీర్చే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు. సమస్యను వైసీపీ ప్రభుత్వం పరిష్కరించ లేకపోయింది. వైసీపీకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. టీడీపీ-జన సేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా. అని కూటమి పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించలేని ప్రభుత్వమిది: కాగిత కృష్ణప్రసాద్‌
పెందుర్రులో ఓట్లను అభ్యర్థిస్తున్న కాగిత కృష్ణప్రసాద్‌

టుమిల్లి, ఏప్రిల్‌ 3: ‘‘తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతున్నారు. దోచుకోవడం తప్ప దాహం తీర్చే ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి లేదు. సమస్యను వైసీపీ ప్రభుత్వం పరిష్కరించ లేకపోయింది. వైసీపీకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. టీడీపీ-జన సేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా. అని కూటమి పెడన అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. బుధవారం పెందుర్రులో కాగిత కృష్ణప్రసాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మూడు పార్టీల నాయకులు కలిసి పనిచేస్తామని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో పెడన నియోజకవర్గంలో జనసేన నాయకులు సైని కుల్లా పనిచేస్తున్నారని, తనకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. గడప గడపకు తిరుగుతూ సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు, బాబ్జీ, నాగచంద్ర పాల్గొన్నారు.

దైవసేవకుల సంక్షేమం కోసం పనిచేస్తా

పెడన: దైవసేవకుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ కాలనీలోని దావీదు చర్చిలో బుధవారం దైవసేవకుల సమావేశంలో ఆయన మాట్లా డారు. తనను, ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఆదరించి ఆశీర్వదాలు అందజేయాలని కోరారు. చర్చిలో కృష్ణప్రసాద్‌ ప్రార్థనలు చేశారు. బొడ్డు వేణుగోపాలరావు, రెవరెండ్‌ బి.ఎస్‌.కిరణ్‌పాల్‌, ఉజ్జీవం, పరిశుద్ధరాజు, డానియేల్‌, ప్రభుదాస్‌, దావీదు, నియోజకవర్గ పరిధి లోని దైవసేవకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 01:19 AM