Share News

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:47 AM

‘‘ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించమని అడుగుతు న్నారు. అవి సాధించుకోవటానికే ఉద్యమానికి దిగారు. ఐదేళ్లుగా దాచుకున్న డబ్బులు ఇవ్వం డంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన చేస్తు న్నారు.’’ అని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు అన్నారు.

గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు
విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రమిస్తున్న బండి శ్రీనివాసరావు, జేఏసీ నేతలు

మా బకాయిలు చెల్లించమనే అడుగుతున్నాం: ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ‘‘ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించమని అడుగుతు న్నారు. అవి సాధించుకోవటానికే ఉద్యమానికి దిగారు. ఐదేళ్లుగా దాచుకున్న డబ్బులు ఇవ్వం డంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన చేస్తు న్నారు.’’ అని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం ఉద్యమ శంఖారావంలో భాగంగా రవాణా శాఖ కార్యాలయ ఆవర ణలో ఉద్యోగుల ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఉద్యో గుల ఆవేదనతో కూడిన వినతిపత్రాన్ని అందిం చారు. ఉద్యోగులు ఈ రోజున ఆకలి పోరాటం చేస్తు న్నారని, ఏ ప్రభుత్వానికీ సహకరించని స్థాయిలో ఇప్పటివరకు ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు వివిధ స్థాయిల్లో సహకరించారని ఆయన అన్నారు. ఉద్యో గులు తమ కుటుంబ అవసరాల కోసం వివిధ రూపాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఉద్యోగులను ఎగవేతదారులుగా ప్రకటించే దుస్థితి దాపురించిం దన్నారు. నాలుగేళ్లుగా ఉద్యోగులు దాచుకున్న డబ్బు లు ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు.

27న ‘చలో విజయవాడ’

నాలుగేళ్లుగా ఒక్క డీఏ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇదేనని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాచుకున్న సొమ్ములను పథకాల రూపంలో ప్రజ లకు పంచడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతి పీఆర్సీలోనూ జీతభత్యాల పెంపు ఉంటుందని ఈ ప్రభుత్వం పెంచకపోగా తగ్గించిం దన్నారు. పదకొండో పీఆర్సీని పూర్తిగా లేకుండా చేసిందన్నారు. పన్నెండో పీఆర్సీ ఇస్తారనుకుంటే దాని అమలులోనే అనేక అవాంతరాలున్నాయ న్నారు. ఇటీవల మంత్రుల బృందంతో జరిగిన చర్చల్లో 49 సమస్యలపై నివేదించామని, ఇప్పటి వరకు ఒక్క సమస్యకైనా ప్రభుత్వం పరిష్కారం చూపలేదన్నారు. ప్రభుత్వానికి ఈనెల 26వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని, 27న చలో విజయ వాడను భారీగా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే: ఎ.విద్యాసాగర్‌

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించు కోకపోతే సరైన సమయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ జేఏసీ ఎన్టీఆర్‌ జిల్లా చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌ హెచ్చరించారు. ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగులకు ఇలాంటి దౌర్భాగ్య పరి స్థితి రాలేదన్నారు. ఎండీ ఇక్బాల్‌, హరినాథ్‌బాబు, శ్రీనివాసరావు, రవీంద్రబాబు, కిషోర్‌, శ్రీనివాసరావు, సాంబశివరావు, ఎం.రాజబాబు, జానీబాషా, రెడ్డమ్మ, శ్రీరామ్‌, సంపత్‌కుమార్‌, జి.నారాయణరావు, పి.రమేష్‌, సతీష్‌ కుమార్‌, విష్ణువర్ధనరావు, నజీర్‌, సీహెచ్‌ ప్రసాద్‌, మధుసూదన్‌ పాల్గొన్నారు.

డిమాండ్లు ఆమోదించే వరకు పోరాటం

మచిలీపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఏపీ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజర య్యారు. జిల్లాపరిషత్‌ కార్యాలయంలో వివిద విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, మధ్యంతర భృతిని విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ఏపీ జేఏసీ కృష్ణాసంఘం కార్యదర్శి ఆకునూరి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు చేపట్టిన ఉద్యమబాటను అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు సాగాలని, ఎన్నికల నోటిఫికే షన్‌ విడుదలయ్యేవరకు పోరా టాన్ని దశలవా రీగా కొనసాగించాలని జడ్పీ యూనిట్‌ ప్రతినిధి ఆర్‌.హేమప్రకాష్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయ కుడు కె.ఆంజనేయులు సూచించారు. పెనమ లూరు మండలం కానూరు హైస్కూల్‌లో ఉపా ధ్యాయులు నిరసన తెలిపారు. మోపిదేవిలో జేఏ సీ నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రమిచ్చారు.

Updated Date - Feb 17 , 2024 | 01:47 AM