Share News

కృష్ణా జేసీగా గీతాంజలి శర్మ

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:49 AM

కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 2022 నవంబరు నుంచి ఆమె కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ను ఇటీవల ఆమె వివాహం చేసుకున్నారు.

కృష్ణా జేసీగా గీతాంజలి శర్మ

మచిలీపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 2022 నవంబరు నుంచి ఆమె కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ను ఇటీవల ఆమె వివాహం చేసుకున్నారు. తనను ఉత్తరప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌గా పంపాలని ఆమె కొంతకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో ఆమెను ఉత్తరప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌కు మార్పుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమెస్థానంలో జేసీగా 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన గీతాంజలి శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఆమె భాధ్యతలు చేపడతారని కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 12:49 AM