Share News

గద్దెనెక్కి.. కాంట్రాక్టు కార్మికుల మాట మరిచిన జగన్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:46 AM

వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఎన్టీటీపీఎస్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులైజేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

గద్దెనెక్కి.. కాంట్రాక్టు కార్మికుల మాట మరిచిన జగన్‌
జి.కొండూరులో వసంత సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 18: వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఎన్టీటీపీఎస్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులైజేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయంలో మాట తప్పారని మైలవరం టీడీపీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ అన్నారు. కొండపల్లి శక్తనగర్‌లో గురువారం సీనియర్‌ సిటిజన్స్‌ను ఓటు అభ్యర్థిం చారు. మహిళలు ఆయనకు హారతులు పట్టారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ఈప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టు లను వైసీపీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో ఇంటింటికీ కుళాయి విషయం లోను వైసీపీ ప్రభుత్వం సహకరించలేద న్నారు. ఎన్టీటీపీఎస్‌ బూడిదను ప్రభుత్వంలో ఉన్న పెద్దలే తిన్నారని, ఆపార్టీలో ఉండగా ఆనింద నామీద వేశారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు జంపాల సీతారామయ్య, చెన్నుబో యిన చిట్టిబాటు, చనమోలు నారాయణ, చుట్టుకుదురు శ్రీని వాసరావు, రాజ్యలక్ష్మి, చుట్టుకుదురు వాసు, ధరణికోట విజయలక్ష్మి, రావి ఫణి, కరిమికొండ శ్రీలక్ష్మి, మైలా సైదులు, పులి దాసు, బొర్రా భూశంకర్‌ పాల్గొన్నారు.

వైసీపీలో కుదుపు..

జి.కొండూరు : చిన్ననందిగామ వైసీపీలో భారీ కుదుపు ఏర్పడింది. వైసీపీ వీడి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఉప్పు మధు, కుంటముక్కల పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు వల్లూరి విఠల్‌రావు, గ్రామ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు పొన్నగంటి వెంకట సాంబశివరావు, మునగంటి ఉమామహేశ్వరరావు, వల్లూరు సత్యప్రసాద్‌, ఉప్పు సతీష్‌, పొన్నగంటి బాబురావు, రాయల హరి, నక్కా నరసింహా, దళితవాడకు చెందిన 10 కుటుంబాలు గురువారం గొల్లపూడి పార్టీ కార్యాలయంలో వసంత కృష్ణ ప్రసాద్‌ సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. వారికి కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానిం చారు. ఇప్పటి వరకు పలు ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసి పార్టీని క్రీయాశీలకంగా ముందుండి నడిపిన మధు, విఠల్‌రావు వారి అనుచరులతో టీడీపీలో చేరడంతో మరింత బలం చేకూరినట్లేనని నాయకులు అంటున్నారు. కార్యక్ర మంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ ధనేకుల సాంబశివరావు (బుల్లి బాబు), మాజీ సర్పంచ్‌ ఉప్పు నాగమల్లేశ్వరరావు (నాగరాజు) పాల్గొన్నారు.

భర్త విజయాన్ని కాంక్షిస్తూ..

వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష గురువారం జి.కొండూరులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. తన భర్తతోపాటు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని)కు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు. నెల్లూరు శ్రీదేవి, పజ్జూరు అంజన, అంకెం ఇందిరా ప్రియదర్శిని, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:46 AM