Share News

పాత శివాలయంలో నేటి నుంచి కల్యాణపుష్పయాగ మహోత్సవం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:22 AM

స్థానిక భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల (పాతశివాలయం) దేవస్థానంలో ఈ నెల 19 శుక్రవారం నుంచి 27 శనివారం వరకు భ్రమరాంబ అమ్మవారికి త్రికాల సహస్రనామార్చన, మల్లేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాయని ఆలయ ఈవో కే.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

పాత శివాలయంలో నేటి నుంచి  కల్యాణపుష్పయాగ మహోత్సవం

పాత శివాలయంలో నేటి నుంచి

కల్యాణపుష్పయాగ మహోత్సవం

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 18: స్థానిక భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల (పాతశివాలయం) దేవస్థానంలో ఈ నెల 19 శుక్రవారం నుంచి 27 శనివారం వరకు భ్రమరాంబ అమ్మవారికి త్రికాల సహస్రనామార్చన, మల్లేశ్వరస్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాయని ఆలయ ఈవో కే.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 19న మహోత్సవాలు ప్రారంభమవుతాయని, 21న సాయంత్రం ఎదురకోల ఉత్సవం, 22న జగజ్జ్యోతి ప్రతిష్ఠాపన, భ్రమరాంబ మల్లేశ్వరుల కల్యాణోత్సవం, 24న ఉదయం పూర్ణాహుతి, కొట్నాలు, వసంతోత్సవం, రాత్రి ధ్వజారోహణ, 25న ద్వదశ ప్రదిక్షణలు రాచకొండ సుమంత్‌శర్మ దంపతులచే, 26న రాచకొండ నాగరాజు శర్మ దంపతులచే పవళింపు సేవ, 27న స్వామి, అమ్మవార్లకు పవళింపు సేవ జరుగుతుంది.కాగా 19 నుంచి 22 వరకు ప్రతిరోజూ సాయంత్రం నిత్య ఔపాసన, బలిహరణ, తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:22 AM