Share News

నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ముఖ్యం

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:30 AM

సాఫ్ట్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం తీవ్రంగా ఉంటోందని ఇస్రో మాజీ అసోసియేటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. శేషగిరిరావు, ఎఫ్‌ట్రానిక్స్‌ అధినేత దాసరి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూతన ఆవిష్కరణలకు   ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ముఖ్యం

నూతన ఆవిష్కరణలకు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ముఖ్యం

వక్తల అభిప్రాయం

మొగల్రాజపురం, జనవరి 29: సాఫ్ట్‌వేర్‌ రంగంలో నూతన ఆవిష్కరణలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం తీవ్రంగా ఉంటోందని ఇస్రో మాజీ అసోసియేటెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. శేషగిరిరావు, ఎఫ్‌ట్రానిక్స్‌ అధినేత దాసరి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. పీబీ సిద్ధార్థ కళాశాల డిపార్ట్‌మెంట్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిపుణులు, రీసెర్చర్స్‌ తదితరులతో సోమవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజస్‌, అల్లారిథమ్స్‌ వంటి వాటి వల్ల ఉపాఽధి అవకాశాలకు రక్షణ ఉంటుందని భావిస్తున్నారని అన్నారు. కాని నూతన ఆవిష్కరణలకు ఏఐ చాలా ముఖ్యమైనదిగా మారిపోయిందన్నారు. ఇతర దేశాలకు చెందిన పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకులు, యూనివర్సిటీ ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, డీన్‌ రాజేష్‌ జంపాల, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి రవికిరణ్‌, జి. సామ్రాట్‌ కృష్ణ, కె. ఉదయశ్రీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:30 AM