Share News

వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్టు చలసాని ఆంజనేయులుపై తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:43 AM

విజయా డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది.

వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్టు చలసాని ఆంజనేయులుపై తప్పుడు ప్రచారం

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

వన్‌టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విజయా డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లటంతో హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లోనే వైసీపీ సభ్యత్వ నమోదును నిలిపివేసింది. పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పుడు రెండేళ్లు కాల పరిమితి మాత్రమే ఉంటుంది. అయితే చలసాని ఆంజనేయులు వైసీపీలో చేరి పార్టీ సభ్యత్వం తీసుకుని 2024 వరకు సభ్యత్వం చెల్లుబాటు అయ్యే విధంగా నకిలీ కార్డు తయారు చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తనపై ఇలాంటి దుష్ప్రచారాలు రావటం బాధాకరమన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 01:43 AM