Share News

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికలకు సర్వం సన్నద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 01:17 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో పోలింగ్‌కు పోలీసు యంత్రాంగం సర్వ సన్నద్ధం చేసుకుంది. ఎక్క డెక్కడ ఎంతెంత బందోబస్తును ఉపయోగించాలో లెక్కలు తేల్చింది.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికలకు సర్వం సన్నద్ధం

8వేల మందితో బందోబస్తు..180 క్రిటికల్‌ పోలింగ్‌ బూత్‌లు

గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్‌

కర్ణాటక, తమిళనాడు నుంచి బలగాల రాక

సిబ్బందికి సహాయకులుగా మాజీ సైనికులు

115 ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటు

‘ఆంధ్రజ్యోతి’తో సీపీ రామకృష్ణ

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

ఎన్టీఆర్‌ జిల్లాలో పోలింగ్‌కు పోలీసు యంత్రాంగం సర్వ సన్నద్ధం చేసుకుంది. ఎక్క డెక్కడ ఎంతెంత బందోబస్తును ఉపయోగించాలో లెక్కలు తేల్చింది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, పోరు ఉత్కంఠంగా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. గడచిన ఎన్నికల వరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలను గుర్తించిన ఎన్నికల కమిషన్‌ ఈసారి వాటిని తొలగించింది. ఆ స్థానంలో క్రిటికల్‌, నార్మల్‌ అనే కేటగిరీలను తీసుకొచ్చింది. జిల్లాలో సోమవారం జరిగే పోలిం గ్‌కు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పోలీసు కమిషనర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పోలింగ్‌ బందోబస్తుకు ఎంతమందిని ఉపయోగిస్తున్నారు?

జవాబు: జిల్లాలో ఎన్నికల విధులకు మొత్తం 8వేల మందిని బందోబస్తుకు ఉపయోగిస్తున్నాం. వారిలో 5వేల మంది సివిల్‌ పోలీసులు ఉంటారు. ఏపీఎస్పీకి చెందిన పది బెటాలియన్లు బందోబస్తు విధుల్లో ఉంటాయి. ఇది కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి పోలీసులను రప్పించాం. కర్ణాటక హోంగార్డు (కేహెచ్‌జీ) 334 మంది వచ్చారు. తమిళనాడు నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 166 మంది వచ్చారు. 13 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాలు వచ్చాయి. ఒక్కో కంపె నీలో 108 మంది సిబ్బంది ఉంటారు. సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, నాగాలాండ్‌ స్పెషల్‌ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా మొత్తం 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. అన్ని మద్యపాన దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయాలి.

జిల్లాలో ఉన్న క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఎన్ని?

జవాబు: కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన నిబంధనల ప్రకారం క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాం. ఇదివరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక అని పోలింగ్‌ కేంద్రాలను గుర్తించేవాళ్లం. ఈసారి ఈసీ వాటిని తొలగించింది. క్రిటికల్‌ (క్లిష్టతరం), నార్మల్‌(సాధారణం) విభాగాలుగా పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని ఆదేశాలిచ్చింది. 180 క్రిటికల్‌ పోలింగ్‌స్టేషన్లను జిల్లాలో గుర్తించాం.

గొడవల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా?

జవాబు: సాధారణ బందోబస్తుతోపాటు ఎక్కడైనా గొడవలు, వివాదాలు జరి గితే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. మొత్తం 55 స్టాటి స్టికల్‌ సర్వెలెన్స్‌ ఫోర్స్‌లను నియమించాం. ఇవి కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా స్ట్రైకింగ్‌ ఫోర్సులను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా గొడవలు జరిగితే సమా చారం అందిన వెంటనే ఐదు నిమిషాల్లో ఈ బలగాలు అక్కడికి చేరుకుంటాయి. ఇవి కాకుండా అన్ని నియోజకవర్గాల్లో 400 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం.

మాజీ సైనికులను విధులకు ఉపయోగించే అవకాశముందా?

జవాబు: పోలీసులు, పారామిలటరీ బలగాలతోపాటు మాజీ సైనికులు, రిటైర్డ్‌ పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వలంటీర్లను ఉపయోగిస్తున్నాం. మాజీ సైనికు లను ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు నియమించుకుంటారు. మాజీ సైనికులు 300 మంది, ఎన్‌సీసీ క్యాడెట్లు 200 మంది, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు 1300 మంది, మాజీ సైనికులు 100 మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. వాళ్లంతా పోలింగ్‌ సిబ్బం దికి సహాయకులుగా ఉంటారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎవరూ నిలబడకుండా విధులు నిర్వర్తిస్తారు.

క్రిటికల్‌ ప్రదేశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా?

జవాబు: కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ఉంటుంది. క్లిష్టతర పరిస్థితులు ఉంటాయని భావించిన చోట్ల సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. ఇవి కాకుండా పోలీసు శాఖ ప్రత్యేకంగా 115 ప్రదేశాల్లో 404 పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటితోపాటు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు కమిషనర్‌ కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అను సంధానం చేశాం.

ఇప్పటి వరకు ఎంతమంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశారు?

జవాబు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో 4,400 మంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 95 కేసులు నమోదు చేశాం. వాళ్లందరినీ అరెస్టు చేశాం. జిల్లాలో లైసెన్స్‌ కలిగిన 445 తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డుల వద్ద తుపాకులను మాత్రం డిపాజిట్‌ చేయించలేదు.

అభ్యర్థులు, ఓటర్లకు మీరు ఇచ్చే సూచన?

జవాబు: మన ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రధానమైనది. అది ప్రజాస్వా మ్యానికి మూలస్తంభం. ప్రజలు చాలా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకో వచ్చు. అభ్యర్థులు పోలీసులకు సహకరించాలి. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఉపే క్షించే ప్రసక్తి లేదు.

Updated Date - May 12 , 2024 | 01:17 AM