తానులేకున్నా.. ఇద్దరికి ప్రాణం
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:19 AM
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్ ప్రక్రియద్వారా మరో ఇద్దరు రోగులకు అమర్చిన సంఘటన పోరంకి క్యాపిటల్ ఆసుపత్రిలో జరిగింది.

పెనమలూరు, జూన్26 : రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబసభ్యుల అంగీకారంతో జీవన్‌దాన్ ప్రక్రియద్వారా మరో ఇద్దరు రోగులకు అమర్చిన సంఘటన పోరంకి క్యాపిటల్ ఆసుపత్రిలో జరిగింది. మంగళవారం పోరంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకిపాడుకు చెందిన జోగి కరుణప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో అతడి అవయవాలను సేకరించడానికి జీవన్‌దాన్ సంస్థకు సమాచారం ఇచ్చారు. ఒక కిడ్నీ, కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి, మరో కిడ్నీని క్యాపిటల్ ఆసుపత్రిలోనే మరో రోగికి అమర్చారు. క్యాపిటల్ ఆసుపత్రి నుండి మణిపాల్ ఆసుపత్రికి తరలించడానికి గ్రీన్‌కారిడార్‌ను రూపొందించి సహకరించారు. అవయవదానం చాలామంది ప్రాణాలను కాపాడుతుందని క్యాపిటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పవన్‌కుమార్ తెలిపారు.