Share News

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:17 AM

జిల్లాలో ఎన్నికల సమయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి శాంతిభద్రతలను పరిరక్షించాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాల అధికారులతో కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపుహాలులో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండండి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్నికల సమయంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి శాంతిభద్రతలను పరిరక్షించాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాల అధికారులతో కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపుహాలులో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా వివిధశాఖల అధికారులతో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించి అక్కడ అల్లర్లు జరగకుండా నిఘా ఉంచాలన్నారు. గంజాయి, మద్యం, నగదు రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఉంచి నియంత్రణ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పోలీ్‌స, ఇంకా అవసరమైన బలగాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎస్‌, పదవీవిరమణ పొందిన పోలీ్‌స అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన వైర్‌లెస్‌ సెట్లను సమకూర్చుకోవాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా స్ర్టైకింగ్‌ఫోర్స్‌, స్పెషల్‌ స్టైకింగ్‌ ఫోర్స్‌, షాడో టీమ్స్‌ ఏర్పాట్లపైనా సమీక్ష చేశారు. లైసెన్సు ఆయుధాలను స్వాధీనం చేసుకుని, చట్టబద్దంకాని ఆయుధాలు ఎవరివద్దనైనా ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలన్నారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచి వారిని బైండోవర్‌ చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ, ఎఫ్‌ఎ్‌సటీ, ఎస్‌ఎ్‌సటీ బృందాల వాహనాలకు జీపీఎస్‌ సౌకర్యం కల్పించామన్నారు. సీ-విజిల్‌కు ఫిర్యాదులు వస్తే వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ఈనెల 18వ తేదీనుంచి నామినేషన్ల స్వీకరణకార్యక్రమం ప్రారంభమవుతుందని, ఎన్నికల నియమావళిని రిటర్నింగ్‌ అధికారులు తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలవద్ద పటిష్టబందోబస్తును నిర్వహించాలన్నారు ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు, రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌, రెవెన్యూ, ఎకై్ౖసజ్‌, ఇన్‌కంట్యాక్స్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 01:17 AM