Share News

ఎన్నికల నియమావళి పాటించాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:56 AM

ప్రింటర్స్‌, పబ్లిషర్స్‌ యజమానులు తప్పక ఎన్నికల నియమావళి పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు.

 ఎన్నికల నియమావళి పాటించాలి
మాట్లాడుతున్న సెంట్రల్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి స్వప్నిల్‌ దినకర్‌

ఎన్నికల నియమావళి పాటించాలి

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచన

చిటిచిట్టినగర్‌, మార్చి 28: ప్రింటర్స్‌, పబ్లిషర్స్‌ యజమానులు తప్పక ఎన్నికల నియమావళి పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ హెచ్చరించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమిషనర్‌ చాంబర్‌లో ప్రింటర్స్‌, పబ్లికేషన్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రింటర్స్‌, పబ్లిషర్స్‌ యజమానులు పోస్టర్స్‌ ముద్రించే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ముద్రించాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోస్టర్‌లు, బ్రోచర్స్‌ ముద్రించే సమయంలో తమ సంస్థ ప్రింటర్‌, పబ్లిషర్స్‌ చిరునామా ఉండాలన్నారు. అలా లేనియెడల చర్యలుంటాయన్నారు. ప్రింటర్స్‌, పబ్లిషర్స్‌ యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:56 AM