Share News

ఎన్నికల నిబంధనలు గాలికి..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:43 AM

పట్టణంలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను నామినేషన్‌ సంద ర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన బహిరం గసభ, ర్యాలీలో ఎన్నికల నిబంధనలు పాటించలే దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల నిబంధనలు గాలికి..
బస్టాండ్‌లో నిలిపిన వైసీపీ నేతల వాహనాలు

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 24: పట్టణంలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను నామినేషన్‌ సంద ర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన బహిరం గసభ, ర్యాలీలో ఎన్నికల నిబంధనలు పాటించలే దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్టాండును వైసీపీ నేతలు పార్కింగ్‌ మార్చేశా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ డీజేలు ఏర్పాటు చేసి ర్యాలీలో మోత పుట్టించారు. బైక్‌లపై కార్యకర్తలు సైలెన్సర్‌ తీసి విన్యాసాలు చేశారు. వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆయన విగ్రహం మీద నుంచి వైసీపీ జెండా తోరణాలు కట్టారు. తెలుగుదేశం అభ్యర్ధి శ్రీరాం తాతయ్య నివాసం మీదగా ర్యాలీ వెళ్లకుండా పోలీసులు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద బాణసంచా కాల్చారు. ఎన్నికలు నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ అధికారులు కనీసం వాహ నాలను తీయించే ప్రయత్నం చేయకపోవటంపై ప్రయాణి కులు అసహనం వ్యక్తంచేశారు. సభలో ప్రసం గించిన విజయవాడ పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, సామినేని ఉదయభాను టీడీపీ అభ్యర్థి తాతయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:43 AM