ఎనిమిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:49 AM
గం జాయి మత్తులో నలుగురు యువకులు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం గ్యాంగ్‌రే్‌పకు పాల్పడ్డారు.

నలుగురు యువకుల ఘాతుకం..
దేహశుద్ధి చేసి ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
పారిపోయిన మరో ఇద్దరు
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నగరంలో దారుణం జరిగింది. గం జాయి మత్తులో నలుగురు యువకులు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం గ్యాంగ్‌రే్‌పకు పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. నగరానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై గంజాయి మత్తులో నలుగురు యువకులు గ్యాంగ్‌రే్‌పకు పాల్పడ్డారు. గమనించిన చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ వచ్చి వారికి దేహశుద్ధి చేశారు. ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరిని ఇనకుదురు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. చుట్టుపక్కల వారు ఇచ్చిన ఫిర్యాదుపై ఇనకుదురు సీఐ పరమేశ్వర్ కే సు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ అబ్దుల్‌సుభాన్ తెలిపారు.