Share News

దుర్గమ్మకు భక్తజన నీరాజనం

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:29 AM

దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

దుర్గమ్మకు భక్తజన నీరాజనం

దుర్గమ్మకు భక్తజన నీరాజనం

వన్‌టౌన్‌, జూన్‌ 7: దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియనుండడంతో వివిధ ప్రాంతాలకు యాత్రికుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలోనే దుర్గమ్మను వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకుని మొక్కుల తీర్చుకున్నారు. ఆర్జిత సేవలైన నవావరణార్చన, ఖడ్గమాలార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, లక్షకుంకుమార్చన తదితర పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు అన్నప్రసాద స్వీకరణ చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచే అన్నవితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 5వేల మందికి పైగానే భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Updated Date - Jun 08 , 2024 | 12:29 AM