దుర్గమ్మకు పుస్తక నీరాజనం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:01 AM
జగన్మాత కనకదుర్గమ్మ ప్రాశస్త్యాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు, అమ్మవారి ప్రాభవాన్ని వివరించే పలు పుస్తకాలను దుర్గామల్లేశ్వరస్వామి దేవ స్థానం ముద్రిస్తోంది. ఈవో కేఎస్ రామారావు పుస్తకాల ముద్రణకు చొరవ తీసుకున్నారు. పుస్తకాలను ప్రచురించడమే కాకుండా, తానే సంకలనకర్తగా వ్యవహరిస్తున్నారు. అమ్మవారి వైభవం పట్ల పూర్తి అవగా హన ఉన్న ఆయన, పండితులతో చర్చించి పలు పుస్తకాలను వెలువ రించారు. ఇవీ పుస్తక విశేషాలు..
కనకదుర్గ వైభవాన్ని అక్షరబద్ధం చేసిన దుర్గగుడి ఈవో రామారావు
(ఆంధ్రజ్యోతి-వన్‌టౌన్)
కనకదుర్గా వైభవం
దుర్గమ్మ ప్రాభవాన్ని వివరిస్తూ రూపొందించిన పుస్తకమే కనకదుర్గా వైభ వం. కనకదుర్గ ఉపాసనాపరమైన విషయాలను భక్తులకు అందించాలన్న తపనతో ఈవో కేఎస్ రామారావు ఈ పుస్తకాన్ని రూపొందించారు. సృష్టి లక్ష్మీ సీతారామంజనేయశర్మ పరిశోధన చేసి వెలిబుచ్చిన అనేక విషయాలను పొందుపరుస్తూ కనకదుర్గావైభవం పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకంపై శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ స్వామి, ఉత్తర పీఠాధిపతి విదుశేఖర భారతీ, విద్యానారాయణతీర్థులు, స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సర స్వతి తమ శ్రీముఖాలను అందించారు. ఈ గ్రంథ రచనలో కోడూరు వెం కట గోపాలకృష్ణశర్మ, హేమ దంపతులు, టి.లక్ష్మీనాగపద్మావతి, లక్ష్మీమాధురి, వేదాంత విశారద సృష్టి లక్ష్మీ ప్రసన్నాం జనేయశర్మ, సృష్టి లక్ష్మీనరసింహం, సృష్టి లక్ష్మీధరశర్మ, ఆవంచ శారదావరప్ర సాద్ దంపతులు, మంతెన భారతి, మంతెన యోగేంద్ర కుమారవర్మ, దేవ స్థానం వేద పండితులు విరూపాక్షం శ్యావాస్వ మహర్షి, శంకర శాండిల్య శర్మ తదితరులతో పాటు కనకదుర్గ ప్రభ సంపాదకుడు గంగాధర్, సైదా, తదితరులు గ్రంథ రచనలో తమ సహకారాలను అందించారు. ఇందులో కనకదుర్గాదేవికి సంబంధించిన అనేక స్ర్తోత్రాలు, అష్టోత్తరాలు, శ్లోకాలు, దుర్గాసప్తశ్లోకి, ఇంకా అనేకమైన ఉపాసనా విధానానికి సంబంధించిన విశేషాలను రాసుకొచ్చారు. మహిషాసురమర్దినిగా అవతరించి దుర్గా రూపం లో భక్తులను కాపాడుతున్న దుర్గమ్మ గురించి ఈ పుస్తకంలో అనేకానేక అం శాలు ఉన్నాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలను ఇందులో స్ప ష్టంగా వివరించారు.
అపౌరుషేయమ్
అపౌరుషేయమ్ పేరిట సంస్కృతంలో శ్రీమహాభాగవతాన్ని రాశారు. దీని ని తెలుగులో నేషనల్ కల్చరల్ రీసెర్చ్ శిక్షణ కేంద్రం(ఎన్‌సీఆర్టీ) అనువదిం చింది. అమ్మవారి అనుగ్రహ చరిత్ర, అమ్మవారిని ఆరాధించే విధివిధానాలతో పాటు మొత్తం 81 అధ్యాయాలతో విశేష గ్రంథంగా ఇది భక్తులకు అపార మైన భక్తి సంపదను అందిస్తోంది. సతీవివాహ వర్ణన, నందికి ప్రథమాధి పత్యం ఇవ్వడం, దక్షయజ్ఞ విశేషాలు, ధక్షయజ్ఞ ధ్వంస వర్ణన, కామరూపాది వర్ణన, గంగాదేవి ఆగమనం, గంగా వివాహం ఇలా అనేక అంశాలను ఇం దులో జోడించారు.
శ్రీదుర్గా సౌందర్యలహరి
శ్రీదుర్గా సౌందర్యలహరిని మహా శతావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గానం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు తుమ్మ లపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నాగఫణిశర్మ గానం చేసిన సౌందర్య లహరిని దుర్గగుడి అధికారులు పుస్తకరూపంలో తీసుకొచ్చారు. దుర్గమ్మను తలచిన భక్తులు ఎవరూ దుర్గతుల పాలు కారంటూ ఆపదలో ఉన్నవారు అమ్మవారిని స్తుతిస్తే తక్షణమే ఆమె ఆపదలను తీరుస్తుందని పేర్కొంటూ ఈ శ్రీదుర్గా సౌందర్యలహరి పుస్తకం రూపొందింది.
సౌభాగ్యమస్తు..
సౌభాగ్యమస్తు పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ప్రముఖ పండితుడు కన్నడ, ఆంధ్ర అవధాని అనంతపురానికి చెందిన జోస్యుల సదానంద శాస్ర్తి ముందు మాట రాసిన ఈ పుస్తకంలో వివాహ వ్యవస్ధను గురించి, దానిలో ఉండే అనేక ప్రక్రియల విశేషాలను వివరించారు. దుర్గగుడిలో అమ్మదర్శనం చేసుకున్న నూతన దంపతులకు అమ్మవారి పసుపు, కుంకుమలతోపాటు ఈ పుస్తకాన్ని ప్రసాదంగా అందిస్తున్నారు. వివాహ సమయంలో పురోహితులు చదివే మంత్రాలు, వివాహతంతులోని అర్థాన్ని అందరూ అర్థం చేసుకునేం దుకు వీలుగా దీనిని రూపొందించారు. ఈవో రామారావు ఆలోచనలను సదానంద శాస్ర్తి అక్షర రూపంలోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో వధూవ రుల పెళ్లిచూపుల నుంచి కన్యావరణం, నిశ్చితార్థం, స్నాతకం, వివిధ హోమాలు, ఏడడుగులు వేయడం, అరుంధతిని చూపించటం, వాటి వెనుక ఉన్న పరమార్థాన్ని ఇందులో వివరించారు.
ఆలయ విజ్ఞానం
ఆలయ విజ్ఞానం పేరిట డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన పుస్తకాన్ని ఈ ఏడాదే ప్రథమ ముద్రణ చేశారు. దీనికి దేవస్ధానం ప్రచురణ బాధ్య తలు నిర్వహించింది. ఆలయాలకు వెళ్లేటప్పుడు ఏం చేయాలి, భక్తులు ఎలా ఆలయానికి వెళ్లాలి..ఎందుకు వెళ్లాలి, ఆలయాల వైభవం ఏమిటి? ఆల యాల్లో వినియోగించే వివిధ వాహనాలు, వాటి విశేషాలు, ఆలయంలో ఉండే బలిపీఠం విశిష్టత, ఆలయ ప్రాంగణంలో ఉండే అనేకానేక విశేషా లను ఇందులో వివరించారు. ఆలయ ధ్వజస్తంభం, ముఖద్వారం, అంతరాల యం, ద్వారపాలకులు, గోపురాలు వంటి ఎన్నో విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
శ్రీదుర్గాభవానీ సంకీర్తన నామావళి
దుర్గానామ సంకీర్తన పరిశోధకుడు డాక్టర్ సృష్టి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ రూపొందించిన దుర్గాభవానీ సంకీర్త నామావళిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. గరికపాటి వెంకట ప్రభాకర్ స్వరకల్పన, గానం అందించారు. ప్రధాన సంపాదకుడిగా కేఎస్ రామారావు వ్యవహరించారు. 41 రోజుల పాటు భవానీదీక్షలు తీసుకునేవారు, భక్తుల అమ్మవారి కృపకు పాత్రుల య్యేందుకు జయదుర్గా జయజయ దుర్గా, జయభవానీ, జయజయ భవానీ అంటూ మొదలైన 41 నామావళిలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. దుర్గాదేవికి నమస్కరిస్తూ 41 రోజులపాటు 41 శ్లోకాలను కీర్తన చేయటం వల్ల మేలుకలుగుతుందని దీనిని పుస్తకం, సీడీ రూపంలోనూ తీసుకొచ్చారు. సంకీర్త నామావళిని గిరిప్రదక్షిణ సమయంలోనూ మైక్‌లో వినిపిస్తున్నారు.
శ్రీ కనకదుర్గా స్ర్తోత్ర లహరి
శ్రీకనకదుర్గా స్ర్తోత్ర లహరి గ్రంఽథాన్ని సృష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మ సంకలనం చేయగా, రామారావు దానికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిం చారు. పంచశక్తి స్వరూపాల్లో దుర్గాదేవికి అత్యంత ప్రాధాన్యం ఉందని వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, దుర్గాదేవి మహాత్యాన్ని అనేక సూక్తా లతో ప్రతిపాదించాయని పేర్కొన్నారు. వేద, ఉపనిషత్తు ఆగమసార భూత మైన దుర్గాదేవి తాత్విక స్వరూపాన్ని భగవంతుడైన వేదవ్యాసుడు దేవీభాగ వతం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, మార్కేండేయ పురాణాల్లో జగన్మాత వైభవాన్ని వర్ణించారని పేర్కొన్నారు. అమ్మవారిని స్ర్తోత్రప్రియ అంటారని ఎవరైతే స్ర్తోత్రం చేస్తారో వారిపై అమ్మవారి వాత్సల్యం ఉంటుం దని, అందుకే స్ర్తోత్రాలను, వైభవోపేత సంఘటనలను అమ్మవారి వైశిష్ట్యా న్ని తెలియజేసేందుకు పుస్తకాలరూపంలో తెస్తున్నట్లు రామారావు చెప్పారు.
శ్రీశైలేశ తీర్థ సారం
శ్రీశైలేశ తీర్థసారం గ్రంథాన్ని 1957లో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి సంస్కృతంలో రాశారు. తర్వాత శ్రిష్టి సీతారామాంజనేయ శర్మ తెలుగులో అనువదించారు. శివాలయాలు, కనకదుర్గమ్మ వైభవాలను పొందుపరిచారు. కృష్ణవేణి నదీమతల్లి విశేష పరమ పావన చరిత్రను రాశారు. ఇంద్రకీలా ద్రికి ఆ పేరు ఎలా వచ్చింది? పురాణ విశేషాలు, దుర్గమ్మ గుడిలో శరన్నవ రాత్రి ఉత్సవాలు, దుర్గా ఉపాసనలతో పాటు నవదుర్గా స్వరూపిణి కనక దుర్గాదేవి అంటూ నవదుర్గల వైభవం, ప్రాభవంపై ఈ పుస్తకంలో రాశారు.