Share News

డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:32 AM

తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్తలను ఇంటింటికీ వెళ్లి సేకరించే వ్యాన్ల డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ శనివారం కార్మికులు, సీఐటీయూ నాయకులు కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు.

 డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న సీఐటీయూ నేతలు

పెనమలూరు, మే 25 : తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్తలను ఇంటింటికీ వెళ్లి సేకరించే వ్యాన్ల డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ శనివారం కార్మికులు, సీఐటీయూ నాయకులు కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. తమకు అడ్వాన్సులు ఇచ్చినట్లు పత్రికల్లో వచ్చిందని, తమకు అడ్వాన్సుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏడాదికి రెండువేల చొప్పున జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాను డ్రైవరుగా పనిచేసే కార్మికులకు రూ.18,500జీతం ఇవ్వాలని, డ్రైవర్లకు ఐడీ కార్డు ఇవ్వాలని, వ్యాను రిపేరు వస్తే డ్రైవర్ల జీతాల్లో కోతలు విధించడం దారుణమని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్‌ నేరెళ్ల, జీ నరసింహరావు, నరేంద్ర, నజీర్‌, సురేష్‌, కే నవీన్‌, శ్రీహరి, సూర్యనారాయణసాయి, నవీన్‌ తదితరులు ఉన్నారు

ఫ కార్మికుల సమస్యలపై వారితో చర్చిండం జరిగిందని, సమస్యలకు తగు పరిష్కారం చూపిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని కమిషనర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇచ్చిన హామీల మేరకు వ్యాను డ్రైవర్లందరూ సోమవారం నుంచి విధుల్లోకి వస్తారని తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 12:32 AM