Share News

కుక్కల నుంచి రక్షణకు కర్రలు పంచుతారా?

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:55 AM

తిరుపతిలో చిరుతల నుంచి తమను తాము కాపాడుకునేందుకు భక్తులకు కర్రలు ఇస్తున్నారు.. పట్టణంలో ప్రజలు కుక్కల భారీన పడకుండా కర్రలు పంచుతారా అని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు.

కుక్కల నుంచి రక్షణకు కర్రలు పంచుతారా?
సమావేశంలో ప్రశ్నిస్తున్న టీడీపీ కౌన్సిలర్లు

తిరువూరు, జనవరి 31: తిరుపతిలో చిరుతల నుంచి తమను తాము కాపాడుకునేందుకు భక్తులకు కర్రలు ఇస్తున్నారు.. పట్టణంలో ప్రజలు కుక్కల భారీన పడకుండా కర్రలు పంచుతారా అని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరి అద్యక్షుతన బుధవారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. టీడీపీ ప్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌, ఎన్‌.సురేంద్ర మాట్లాడుతూ, పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని పలు సమావేశాల్లో పాలకులకు, అధికారులకు చెబుతన్నా పట్టించుకోవటంలేదు. పట్టణంలో ఉదయం వాగింగ్‌ చేస్తున్న వారికి కుక్కల బెడదనుంచి తప్పించుకునేందుకు చేతికర్రలు పంచుదామా! అని ఎద్దేవా చేశారు. 8వ వార్డులో ప్రధాన రహదారులను కలిపే మండల పరిషత్‌ కార్యాలయం నుంచి సహకార బ్యాంకుకు వెళ్లే రహదారిలో కల్వర్టు కుంగి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సర్దార్‌ పేటబాపయ్య కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పట్టణంలోని సమస్యలను సమావేశాల్లో పాలకవర్గం, అధికారుల దృష్టి తీసుకెళుతున్నా ఫలితం ఉండటం లేదంటూ టీడీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం పాలకవర్గం కార్యాలయానికి ప్లాస్టిక్‌ కుర్చీల కొనుగోలు, బోర్ల మరమ్మ తులకు సామగ్రి, కూరగాయల మార్కెట్‌ వేలం అంశాలను ఆమోదించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో మునిసిపల్‌ అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:55 AM