Share News

పోస్టల్‌ బ్యాలెట్‌పై దిశానిర్దేశం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:47 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకోవ డంపై విజయవాడ వేదికగా ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌పై దిశానిర్దేశం

నూరు శాతం ఓటేసేలా ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యోగ సంఘాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ సద్వినియోగానికి ప్రత్యేక బృందాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వినియోగించుకోవ డంపై విజయవాడ వేదికగా ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలు విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ప్రధాన జేఏసీలకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్‌ జీజీవో అసోసియేషన్‌, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎస్‌ఏ)లు సమావేశాలు పెట్టి ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. సీపీఎస్‌ ఉద్యో గుల సంఘం కూడా తమ ఉద్యోగులకు అవగాహన కల్పిస్తోంది. ఏపీఎన్‌జీజీవో అసోసియేషన్‌ తరఫున కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్‌, ఏపీఆర్‌ఎస్‌ఏ తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావులు ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలెట్‌ వేయడంపై కార్యోన్ము ఖులను చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సంఘ సభ్యులతో ఏపీఎన్జీవో ఓభవన్‌, ఏపీ రెవెన్యూ భవ న్‌లో సమావేశాలు నిర్వహించి ఎన్నికల విధుల్లో పాలు పంచుకునే ఉద్యోగులంతా నూరుశాతం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే దిశగా కసర త్తులు చేస్తున్నాయి. ‘‘ఫాం-12డీలను రిటర్నింగ్‌ అధికారులకు ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం సంఘాల దృష్టికి తీసుకురావాలి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కొందరి ఉద్యోగులను నియమించాం. సమస్య తేలకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. ఉద్యో గులకు గతంలో మాదిరిగా ముందస్తుగా ఈ దఫా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వరు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రానికి వెళ్లినపుడు మాత్రమే ఇస్తారు.’’ అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

సాంకేతిక ఇబ్బందులుంటే సంఘాన్ని సంప్రదించండి

ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫాం-12 డీని జమ చేయటానికి ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది. ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్పటికీ ఎన్నికల విధులపై పనిచేస్తున్న నియోజక వర్గంలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోనే ఓటు వేసుకో వటానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యా యులు పోస్టల్‌ బ్యాలెట్లు వేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటేషన్‌ సెంటర్లను పార్ల మెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం, ఆర్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మే 5న పోస్టల్‌ బ్యాలె ట్‌లో ఉద్యోగులు హాజరవ్వటానికి స్పెషల్‌ క్యాజు వల్‌ లీవును ప్రకటించాలి.

- ఎ.విద్యాసాగర్‌, ఏపీఎన్‌జీజీవో అసోసియేషన్‌ ఎన్టీఆర్‌ జిల్లా నాయకుడు

విధులు నిర్వహిస్తున్న చోటే ఓటేయొచ్చు

ఎన్నికల విధులకు కేటాయించిన ఉద్యోగు లంతా వారి ఆర్వో పరిధిలో జిల్లా ఎన్నికల అధి కారి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఫాం-12 డీ సమర్పిస్తే అదే చోట పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు ఎక్కడ ఓటు కలిగి ఉన్నా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే ఓటేయొచ్చు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ఉద్యోగులందరికీ తెలంగాణలో మాదిరిగా ఆరోజున స్పెషల్‌ క్యాజువల్‌ లీవును మంజూరు చేయాలని కోరుతున్నాం.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఆర్‌ఎస్‌ఏ ప్రధాన కార్యదర్శి

Updated Date - Apr 25 , 2024 | 01:47 AM