Share News

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:24 AM

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవు తోందని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.సమరం అన్నారు.

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ర్యాలీలో కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణరావు, ప్రముఖ వైద్యుడు సమరం తదితరులు

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

ఓటుపై అవగాహన ర్యాలీలో డాక్టర్‌ జి.సమరం

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 24: ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవు తోందని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.సమరం అన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, కేబీఎన్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఓటు అవగాహన ర్యాలీని బుధవారం కొత్తపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ సమరం మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతిఒక్కరు సద్విని యోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవు తుందన్నారు. యువజన సర్వీసు శాఖ జిల్లా అధికారి, స్వీప్‌ నోడల్‌ అధికారి యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ పవిత్రమైన ఓటుహక్కును ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. తొలుత ర్యాలీని కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాస్‌ ప్రారంభించారు. పశ్చిమ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి, నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ కీర్తి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు డి.పవన్‌కుమార్‌, ఎన్‌సాంబశివరావు, కల్మబేగం పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:24 AM