Share News

పేదలకు ఇళ్లిస్తామని మోసం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:02 AM

పేదలకు ఇళ్లు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం మోసగించిందని, స్థలాలు చూపకుండా రిజిస్ట్రేషన్‌ అంటూ దగా చేస్తున్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు.

పేదలకు ఇళ్లిస్తామని మోసం

పేదలకు ఇళ్లిస్తామని మోసం

సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు

సత్యనారాయణపురం, ఫిబ్రవరి 24: పేదలకు ఇళ్లు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం మోసగించిందని, స్థలాలు చూపకుండా రిజిస్ట్రేషన్‌ అంటూ దగా చేస్తున్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆరోపించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు నేతృత్వంలో జన శంఖారావం యాత్ర శనివారం దుర్గాపురం, బావాజీపేట, భానునగర్‌, గులాబితోట, రైల్వేకాలనీ, గుణదలలో జరిగింది. ఈ సందర్బ్భంగా ఆయన మాట్లాడుతూ 30లక్షల ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేశామని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని, ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకూ పనికి రానప్పుడు ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి 4.5 కోట్ల జనం సోమ్ముతో ప్యాలెస్‌ నిర్మించుకున్నారని, అదే డబ్బుతో నగరంలో పేదలందరికి ఇళ్లు నిర్మించవచ్చునన్నారు. స్థానిక సమస్యలు పట్టించుకునే నాధుడే లేడు, జనం గోడు వినే వాడు కరువయ్యారని, అందుకే సీపీఎం జన శంఖారావం పూరించిందన్నారు. సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాఽథ్‌, రాష్ట్రకమిటీ సభ్యులు కె. శ్రీదేవి, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ , స్థానిక నాయకులు పి.కృష్ణమూర్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:02 AM