Share News

ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయండి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:39 AM

అంబారుపేటలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆర్డీవో సాయిబాబుకు టీడీపీ నేతలు గురువారం వినతిపత్రం అందించారు.

ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయండి
ఆర్డీవో సాయిబాబుకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

నందిగామ రూరల్‌, జనవరి 11: అంబారుపేటలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆర్డీవో సాయిబాబుకు టీడీపీ నేతలు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి మాట్లాడుతూ రోజుకు 30 ట్రిప్పులకు పైగా ఇసుక రాత్రి సమయాల్లో తరలిపోతుందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తోట నాగమల్లేశ్వరరావు, మన్నే కళావతి, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:39 AM