Share News

దుర్గమ్మ గుడిలో భక్తుల రద్దీ

ABN , Publish Date - May 20 , 2024 | 01:35 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడింది.

దుర్గమ్మ గుడిలో భక్తుల రద్దీ
క్యూలలో కిటకిటలాడుతున్న భక్తులు

వన్‌టౌన్‌, మే 19: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడింది. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగకుండా అమ్మవారి దర్శనం శీఘ్రంగా లభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిత్యార్జిత సేవల్లో పాల్గొని, దుర్గామల్లేశ్వరులను దర్శించుకుని భక్తులు అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు సూర్యోపాసన సేవ చేశారు. అరుణ పారాయణ. ఆది త్యహృదయ పారాయణలు చేశారు. దుర్గమ్మను దేవదాయ కమిషనర్‌ సత్యనా రాయణ దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు ప్రసాదం, శేషవస్త్రం అందించారు.

Updated Date - May 20 , 2024 | 01:35 AM