సీపీఎం ఇంటింటా ప్రచారం
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:44 AM
విద్యుత్ చార్జీల పెంపుపై, స్మార్ట్‌మీటర్ల పెట్టొద్దని కరపత్రాలతోను, గ్రూప్ మీటింగ్‌లతో సీపీఎం పటమట లంక ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించింది.

పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా
సీపీఎం ఇంటింటా ప్రచారం
పటమట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్ చార్జీల పెంపుపై, స్మార్ట్‌మీటర్ల పెట్టొద్దని కరపత్రాలతోను, గ్రూప్ మీటింగ్‌లతో సీపీఎం పటమట లంక ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం తూర్పు నగర కార్యదర్శి పి. కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం తప్పుతోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలపై రూ.15,484 కోట్ల సర్ధుబాటు చార్జీలు వేశారని ఆరోపించారు. పాత మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని విమర్శించారు. విద్యుత్ ప్రైవేటీకరణ చేయొద్దని సీపీఎం ప్రచారం చేపట్టిందన్నారు. జనవరి 7న ఉదయం 10 గంటలకు ఏ కన్వెన్షన్ బృందావన్ కాలనీ దగ్గర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ అధికారులతో, ప్రజలతో చర్చించనున్నారని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు వి. గురుమూర్తి, వి. వరప్రసాద్, వీబీ రాజు, పి. మల్లిఖార్జునరావులు పాల్గొన్నారు.