Share News

స్ట్రాంగ్‌ రూమ్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ, జేసీ

ABN , Publish Date - May 19 , 2024 | 12:27 AM

ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా కళాశాలల్లో భద్రపర్చిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల ను విజయవాడ సీపీ పి.హెచ్‌.డి రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్ట్రాంగ్‌ రూమ్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ, జేసీ
సిబ్బందికి సూచనలిస్తున్న సీపీ రామకృష్ణ

ఇబ్రహీంపట్నం, మే 18: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా కళాశాలల్లో భద్రపర్చిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల ను విజయవాడ సీపీ పి.హెచ్‌.డి రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమ త్తం చేస్తూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద, కౌంటింగ్‌ ఏరియాలను, మెయిన్‌ గేటు నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌ల వరకు తిరిగే రూ ట్‌ మోబైల్స్‌ గురించి పెట్రోలింగ్‌ పార్టీలను, గార్డ్స్‌లను స్వ యంగా పరిశీలించి పలు సూచనలు, సలహాలిచ్చారు. కంట్రోల్‌ రూమ్‌లోని సీసీ కెమెరాల పర్యవేక్షణ పనితీరు ను పరిశీలించారు. డీసీపీలు కె.శ్రీనివాసరావు, ఏబీటీఎస్‌ ఉదయరాణి, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ పాల్గొన్నారు.

ఘర్షణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోండి

జగ్గయ్యపేట, మే 17: కౌంటింగ్‌ రోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు విజయవాడ సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ అన్నారు. జగ్గయ్యపేట సర్కిల్‌ కార్యాలయంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. రెండు గంటల పాటు నియోజకవర్గ పరిస్థితి, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్‌ జరిగిన రోజు గొడవలు జరిగిన ప్రదేశాలను అడిగి తెలుసుకున్నారు. గొడవలు జరగటానికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో నిఘా ఉంచాలన్నారు. జగ్గయ్యపేట, షేర్‌మహ్మద్‌పేటల్లో పోలీస్‌ పికెట్‌లు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో నందిగామ ఏసీపీ డాక్టర్‌ రవికిరణ్‌, సీఐ జానకీరాం, సర్కిల్‌ ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:27 AM