Share News

దుర్గమ్మ హుండీల కానుకల లెక్కింపు

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:20 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపంలో లెక్కించారు. 18 రోజుల వ్యవధికి మొత్తంగా రూ.3,48,33,515లు నగదు సమకూరింది.

దుర్గమ్మ హుండీల కానుకల లెక్కింపు

వన్‌టౌన్‌, జూన్‌ 3 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపంలో లెక్కించారు. 18 రోజుల వ్యవధికి మొత్తంగా రూ.3,48,33,515లు నగదు సమకూరింది. 535 గ్రాముల బంగారం, 7 కేజీల 540 గ్రాముల వెండి లభించింది. 601 యూఎ్‌సఏ డాలర్లు, 5 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 100 ఓమన్‌ బైన్స్‌లు, 10 కెనడా డాలర్లు, 525 అరబ్‌ ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌, 1 కువైట్‌ దినార్‌, 132 సౌదీ రియాల్స్‌, 9 ఖతార్‌ రియాల్స్‌, 10 యూరోలు, 2 సింగపూర్‌ డాలర్లు లభించాయి. ఆన్‌లైన్‌-ఈ హుండీ ద్వారా రూ.1,31,114లు లభించింది. ఈవో కేఎస్‌ రామారావు, దేవదాయశాఖ అధికారులు, ఆలయ అధికారులు, స్పెషల్‌ పోలీస్‌, సిబ్బంది, వన్‌టౌన్‌ పోలీస్‌ సిబ్బంది, భవానీ సేవాదారులు తదితరులు పాల్గొన్నారు.

అన్న వితరణకు విరాళం

దుర్గగుడిలో అన్నవితరణకు గుంటూరు అరండల్‌పేటకు చెందిన పప్పుల వెంకటేశ్వరరెడ్డి సోమవారం ఆలయానికి విచ్చేసి పప్పుల శ్రీథర్‌రెడ్డి పేరిట అన్నవితరణ నిర్వహించేందుకు రూ.1,00,116లు విరాళంగా సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.

అభయాంజనేయునికి రూ.15.67 లక్షలు..

హనుమాన్‌ జంక్షన్‌ : స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గడిచిన 71 రోజులకుగాను రూ.15,67,716లు ఆదాయం కానుకుల రూపంలో సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్‌ తెలిపారు. లెక్కింపును ఆగిరిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో దారపురెడ్డి సురే్‌షబాబు పర్యవేక్షించారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:20 AM