Share News

కౌంటింగ్‌ బహిష్కరిస్తున్నా

ABN , Publish Date - May 26 , 2024 | 12:49 AM

‘‘కౌంటింగ్‌ రోజున నాపై వైసీపీ నేతలు దాడులకు దిగే అవకాశం ఉంది. అందుకే కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నా.’’ అని జగ్గయ్యపేట అసెంబ్లీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి వేల్పుల విజయకుమార్‌ తెలిపారు.

కౌంటింగ్‌ బహిష్కరిస్తున్నా
మాట్లాడుతున్న వేల్పుల విజయకుమార్‌

ఆరోజున నాపై వైసీపీ నేతలు దాడి చేసే అవకాశముంది

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, బెదిరిస్తున్నారని పోలింగ్‌, పోలీసు అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేశా..

అయినా పట్టించుకోలేదు: జగ్గయ్యపేట ఇండిపెండెంట్‌ అభ్యర్థి వేల్పుల విజయకుమార్‌

జగ్గయ్యపేట, మే 25: ‘‘వైసీపీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి జగ్గయ్య పేటలో ఓటర్లను ప్రలోభపెట్టింది. వెబ్‌ క్యాస్టింగ్‌ లేకుండా ఎన్నికల అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఇంతకు ముందే ఫిర్యాదు చేశా. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను కుమారుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్‌, అల్లుడు విజయ నరసింహారెడ్డి నాపై బెదిరింపులకు దిగారు. దీనిపైనా పోలీసులకు, ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశా. అయినా స్పందించలేదు. కౌంటింగ్‌ రోజున నాపై వైసీపీ నేతలు దాడులకు దిగే అవకాశం ఉంది. అందుకే కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నా.’’ అని జగ్గయ్యపేట అసెంబ్లీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి వేల్పుల విజయకుమార్‌ తెలిపారు. సీఈసీ, డీజీపీ, పోలింగ్‌ అధికారులకు జగ్గయ్యపేట నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ద్వారా లేఖ పంపేందుకు శనివారం తహసీల్దార్‌ కార్యాలయానికి విజయకుమార్‌ రాగా, ఆర్వో అందుబాటులో లేరు. దీంతో అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జగ్గయ్యపేట తహసీల్దార్‌ జీవీ శేషుకు కౌంటింగ్‌ బహిష్కరిస్తున్నట్టు ఆయన లేఖ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను కుమా రుడు, అల్లుడు బెదిరించినట్టు అధారాలు ఉన్నా, పోలీసులు, పోలింగ్‌ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. తాను ఇచ్చిన లేఖను ఎండార్స్‌ చేస్తూ సీఐకు, నంది గామ ఏసీపీకి చర్యలు తీసుకోవాలని ఈ ఆర్వో లేఖ రాశారని, అయినా తనను సీఐ విచారణ జరిపి వాంగ్మూలం కూడా తీసు కోలేదని తెలిపారు. ఈనెల 6న తాను అభ్యంతరం చెప్పే వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుకు సీల్‌ వుయలేదని, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు కాకపోయినా ఉదయభాను కుటుంబసభ్యులంతా పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగారని, వెబ్‌క్యాస్టింగ్‌ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయని తెలిపారు. ఎన్ని కల కోడ్‌ ఉల్లంఘించి అనేక గ్రామాల్లో అధికార పార్టీ బోర్లు వేసిందని, ప్రార్థనా మందిరాలకు వస్తువులు పంపిణీ చేసిందని, కొందరు ఓటర్లకు మద్యం సర ఫరా చేసిందని, మాంసాహార విందులు ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వీట న్నింటిపై ఫిర్యాదు చేసినా పోలింగ్‌ అధికారులు, పోలీసులు స్పందించలేదన్నారు. వైసీపీ నేతల బెదిరింపు దృశ్యాలను ఆయన విడుదల చేశారు. ఈసీ, డీజీపీ, జిల్లా, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.

పోలీసుల నిర్లక్ష్యంపై పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీకి ఫిర్యాదు

తనపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగడంపై జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు దాటినా స్పందించలేదని దీంతో రాజమండ్రి పోలీస్‌ కంప్లయింట్‌ అథారిటీకి ఫిర్యాదు చేశానని వేల్పుల విజయకుమార్‌ తెలిపారు. తాను నేరుగా ఫిర్యాదు చేశానని, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ద్వారా ఫిర్యాదు పంపానని అయినా విచారించలేదని అందులో పేర్కొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:49 AM