Share News

కానిస్టేబులా..మజాకా!

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:20 AM

వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహి స్తున్న ఓ కానిస్టేబుల్‌ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పోలీస్‌ ఉన్నతాధి కారుల పేర్లు చెప్పి, పదుల సంఖ్యలో భక్తులను అనధికారికంగా తీసుకువెళ్లి దర్శనాలు చేయిస్తున్నాడని, అడ్డుకుంటున్న ఉద్యోగులు, అర్చకులపై బెదిరిం పులకు దిగుతున్నాడని దేవస్థానంలోని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు.

కానిస్టేబులా..మజాకా!

పోలీస్‌ ఉన్నతాధికారుల పేర్లతో దుర్గగుడిలో అనధికార దర్శనాలు

అడ్డుకుంటున్న ఉద్యోగులు, అర్చకులపై బెదిరింపులు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహి స్తున్న ఓ కానిస్టేబుల్‌ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పోలీస్‌ ఉన్నతాధి కారుల పేర్లు చెప్పి, పదుల సంఖ్యలో భక్తులను అనధికారికంగా తీసుకువెళ్లి దర్శనాలు చేయిస్తున్నాడని, అడ్డుకుంటున్న ఉద్యోగులు, అర్చకులపై బెదిరిం పులకు దిగుతున్నాడని దేవస్థానంలోని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వీఐపీలు, ఉన్నతాధికారుల సమాచా రాన్ని ముందుగా ఆయా విభాగాల ఉద్యోగులు దేవస్థానం సమాచార కేం ద్రంలో తెలియజేస్తారు. వారు దేవస్థానానికి వచ్చాక ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది వారిని ప్రొటోకాల్‌ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి వారి వివరాలు అక్కడ తెలిపి వీఐపీ టికెట్లు కొనుగోలు చేసి, అనంతరం అమ్మ వారి దర్శనానికి తీసుకెళుతుంటారు. వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా భక్తులను తీసుకువెళ్లి ఆనధికారికంగా దర్శ నాలు చేయిస్తున్నాడు. ఉద్యోగులు ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల పేర్లు చెబుతు న్నాడు. ఇటీవల ఆ కానిస్టేబుల్‌ ఎనిమిది మంది భక్తులను దేవస్థానం ప్రొటోకాల్‌ అధికారులు, సిబ్బంది అనుమతి లేకుండా ఆశీర్వచనం మం డపం పక్కన నుంచి దర్శనానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉన్న పలువురు ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ ఉన్నతాధికారుల తాలుకా వారిని అడ్డుకుంటారా? మీపైన పై అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్‌ చేయిస్తానని బెదిరించాడని ఉద్యోగులు, సిబ్బంది చెబుతున్నారు. ఆలయ ఈవో కేఎస్‌ రామారావు టికెట్లు లేకుండా ఎవరినీ అమ్మవారి దర్శనానికి అనుమతించొద్దని ఆదేశించడంతో వీఐపీలు, ఉన్నతాధికారులను తప్పని సరిగా టికెట్‌ తీసుకోవాల్సిందేనని అధికారులు, ఉద్యోగులు సూచిస్తున్నారు. దాంతో వారు టికెట్‌ తీసుకునే అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు. వన్‌ టౌన్‌ కానిస్టేబుల్‌ సమాచార కేంద్రంలో తెలియజేయకుండా పోలీస్‌ అధికా రుల పేర్లు చెప్పి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లడం ఉద్యోగులకు, అర్చకు లకు ఇబ్బందిగా మారింది. పలువురు ఉద్యోగులు కానిస్టేబుల్‌ వ్యవహారాన్ని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు దృష్టికి తీసుకుని వెళ్లనున్నారు. దుర్గగుడిలో విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్‌పై వన్‌టౌన్‌ సీఐ ధనశేఖర్‌రెడ్డి దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 01:20 AM