ఎంఈవో అవమానిస్తున్నారని ఫిర్యాదు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:08 AM
మహిళా ఉపాధ్యాయులను ఎంఈవో-1 జి.వెంకటేశ్వరరావు టార్గెట్ చేస్తున్నారని, తన పరు ష మాటలతో అగౌరవపరుస్తున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మైథిలి, ఎం.విజయశ్రీ, సభ్యురాలు బి.హిమబిందు ఆరోపించారు.

తోట్లవల్లూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళా ఉపాధ్యాయులను ఎంఈవో-1 జి.వెంకటేశ్వరరావు టార్గెట్ చేస్తున్నారని, తన పరు ష మాటలతో అగౌరవపరుస్తున్నారని, అవమానాలకు గురిచేస్తున్నారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మైథిలి, ఎం.విజయశ్రీ, సభ్యురాలు బి.హిమబిందు ఆరోపించారు. పలు ఆరోపణలతో కూడిన ఫిర్యాదును బుధవారం తోట్లవల్లూరు ఎంపీడీవో రవికాంత్‌కు వారు అందించారు. ఎంఈవోకు కూడా ఫిర్యాదును అందించి పాయింట్ల వారీగా ఆయనను నిలదీశారు. అనంతరం విజయశ్రీ, హిమబిందు మాట్లాడారు. ‘ఈనెల 19న నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశాల్లో చాగంటిపాడు స్కూల్ హెచ్‌ఎంను ఏ కారణమూ చూపకుండా అవమానించారు. 20న పెనమకూరు కాంప్లెక్స్ సమావేశం లో కేవలం మహిళా ఉపాధ్యాయులనే తీవ్రస్థాయిలో అవమానించారు. మహిళలని చూడకుండా అంతమందిలో నిలబెట్టి మానసికంగా బాధపడేలా మాట్లాడారు. గతంలో యాకమూరు యూపీ, వల్లూరుపాలెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారు. నాలుగేళ్లుగా అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎంఈవో మాటతీరులో మార్పు రాలేదు. ఇదే ఆఖరి హెచ్చరిక. మరోసారి ఎంఈవో మహిళా ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తే ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతాం.’ అని వారు హెచ్చరించారు.