Share News

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:57 AM

సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పునాదుల మీద పుట్టిన టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే   ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో బొండా ఉమా తదితరులు

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో

బొండా ఉమా తదితరులు

రాబోయే

ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా

మధురానగర్‌, జనవరి 20: సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పునాదుల మీద పుట్టిన టీడీపీ రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారంటీతో ప్రకటించిన పథకాలను అన్నింటిని తక్షణమే అమలు చేస్తుందని తెలిపారు. శుక్రవారం 29వ డివిజన్‌ మధురానగర్‌లో వీవీ నరసరాజు రోడ్డు కృష్ణుడి గుడి నుంచి భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బొలిశెట్టి వంశీకృష్ణతో కలిసి బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పూర్‌ టు రిచ్‌పై భరోసాను కల్పించే విధంగా పథకాల వివరాలను ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డివిజన్‌లో ఉచితంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌, ఎమ్మెల్యే విష్ణు పట్టించుకోలేదని, కానీ లబ్ధిదారులు రూ.20వేలు, కోనుగోలుదారులు రూ.40వేల చొప్పున కట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని డివిజన్‌ వాసులను మోసగించారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్‌ అద్యక్షుడు పీవీఆర్‌, ఇన్‌ఛార్జి నెక్కంటి ప్రసాద్‌, వెంకన్న, రాబిల్లి సూరి, జనసేన డివిజన్‌ అధ్యక్షులు కెంబూరి కృష్ణ, కెంబూరి భవానీ, శ్యాం ప్రసాద్‌, మారాసు రమణ, వెంపటాపు శ్రీను, పాల రజిని, నాయకులు బర్మాశ్రీను, అన్వర్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి

అజిత్‌సింగ్‌నగర్‌: రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజలకు వివరించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్‌ కార్యాలయంలో శనివారం 58వ డివిజన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ మరో 80 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈనెల 22న నూతన ఓటర్‌ లిస్ట్‌ విడుదల కానుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఓటర్‌ లిస్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి డివిజన్‌లోని ఓట్లను సరిచూసుకోవాలని సూచించారు. తమ అఽధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేతలు ఘంటా కృష్ణమోహన్‌, దాసరి కనకారావు, పిరియా సోమేశ్వరరావు,

Updated Date - Jan 21 , 2024 | 12:57 AM