Share News

వెనక్కు రండి!

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:24 AM

జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాలి హారికకు కేటాయించిన వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులు, క్యాంపు క్లర్కులు, ఇతర సిబ్బందిని ఇన్‌చార్జి జడ్పీ సీఈవో ఆనందరావు వెనక్కి తీసుకున్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో జ్యోతిబసు స్థానిక జిల్లా అధికారి అయి ఉండి కూడా కదలకపోవటంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయ డంతో జడ్పీ సీఈవోపై జిల్లా యంత్రాంగం వేటు వేసింది.

వెనక్కు రండి!

జడ్పీ చైర్‌పర్సన్‌ దగ్గర పనిచేసే ఉద్యోగుల రీ కాల్‌

ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాలి హారికకు కేటాయించిన వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులు, క్యాంపు క్లర్కులు, ఇతర సిబ్బందిని ఇన్‌చార్జి జడ్పీ సీఈవో ఆనందరావు వెనక్కి తీసుకున్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో జ్యోతిబసు స్థానిక జిల్లా అధికారి అయి ఉండి కూడా కదలకపోవటంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయ డంతో జడ్పీ సీఈవోపై జిల్లా యంత్రాంగం వేటు వేసింది. ఈ క్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికకు కేటాయించిన సిబ్బందిని కూడా వెనక్కు తీసుకోవాల్సిందిగా కృష్ణా కలెక్టర్‌ రాజబాబు ఆదేశించారు. జడ్పీ ఇన్‌చార్జి సీఈవో తక్షణం వారిని వెనక్కు రావాల్సిందిగా ఆదేశించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ హారికకు వీరిని కేటాయించినప్పటికీ ఆమె భర్త, వైసీపీ పెడన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్‌కు వీరంతా సేవలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యంతో.. జడ్పీ చైర్‌పర్సన్‌కు కేటాయించిన వ్యక్తిగత సిబ్బంది అందరినీ వెనక్కు తీసుకోకతప్పలేదు. జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు క్లర్కు (సీసీ) ఏవో అయిన నూతలపాటి శ్రీనివాసరావు పనిచేసేది మొవ్వ ఎంపీపీ పరిధిలో అయినప్పటికీ.. సీసీగా చైర్‌పర్సన్‌ వద్ద ఉంటున్నారు. అసిస్టెంట్‌ సీసీగా జూనియర్‌ అసిస్టెంట్‌ అయిన శివక్రిష్ణను నియమించారు. ఈయన ఒరిజినల్‌ పని బాధ్యతలు చిన్నాపురం జడ్‌పీ హైస్కూల్‌లో. జడ్పీ చైర్‌పర్సన్‌ డ్రైవర్లుగా ఇద్దరు పనిచేస్తున్నారు. వీరిలో మొదటి డ్రైవర్‌ ప్రసాద్‌ జడ్పీ ఆఫీసులో పనిచేయాల్సి ఉంది. రెండవ డ్రూవర్‌ రమేష్‌. ఇతను విజయవాడలోని పీఐయూ డివిజన్‌ ఈఈ దగ్గర పనిచేయాల్సి ఉండగా.. చైర్‌పర్సన్‌ దగ్గర పనిచేయటానికి కేటాయించారు. జడ్పీ చైర్‌పర్సన్‌కు ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను ఇచ్చారు. వీరిద్దరిలో ఎం.కుసుమ హరీష్‌ అనే వ్యక్తి జడ్పీకి చెందినవారు. వీర శివాజీ అనే వ్యక్తి నందివాడ ఎంపీపీ ఆఫీసు ఒరిజినల్‌ వర్కింగ్‌ ప్లేస్‌. వీళ్లందరినీ తాజాగా జడ్పీ చైర్‌పర్సన్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:24 AM