Share News

సురక్షిత నీటికి నోచని కాలనీ ప్రజలు

ABN , Publish Date - May 31 , 2024 | 12:57 AM

తోట్లవల్లూరు శివారు కనకదుర్గమ్మ కాలనీ ఏర్పడి రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఇక్కడి ప్రజలు రక్షిత మంచినీటికి నోచుకోలేదు. 2004లోవిజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానానికి చెందిన 9 ఎకరాల భూములను సేకరించి ఇళ్ళ స్థలాలకు కేటాయించారు. ఈ కాలనీలో 500 మంది నివసిస్తున్నారు.

సురక్షిత నీటికి నోచని కాలనీ ప్రజలు
కనకదుర్గమ్మ కాలనీలో మురుగులో తాగునీటి కుళాయి

తోట్లవల్లూరు : తోట్లవల్లూరు శివారు కనకదుర్గమ్మ కాలనీ ఏర్పడి రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఇక్కడి ప్రజలు రక్షిత మంచినీటికి నోచుకోలేదు. 2004లోవిజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానానికి చెందిన 9 ఎకరాల భూములను సేకరించి ఇళ్ళ స్థలాలకు కేటాయించారు. ఈ కాలనీలో 500 మంది నివసిస్తున్నారు. ప్రారంభంలో తోట్లవల్లూరు రక్షిత మంచినీటి ట్యాంకు నుంచి పైప్‌లైన్‌ వేసి కొంతకాలం తాగునీటిని అందించారు. ఆ తరువాత కాలనీలోనే బోరు నిర్మించి కుళాయిలకు డైరెక్టుగా నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీ ప్రజలకు తాగునీటిని అందించే బోరు సైతం మురుగు నీటిలోనే ఉంటోంది. ఇక కుళాయిల పరిస్థితి అదేవిధంగా ఉంది. కుళాయిలకు ప్లాట్‌ఫారాలు నిర్మించకపోవటంతో మురుగులో ఉన్నాయి. ఎక్కడైనా పైప్‌ లీకైతే మురుగునీరు తాగునీటిలో కలిసి ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం నెలకొంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇక్కడి ప్రజలు జ్వరాలు, అనారోగ్యాలకు గురవుతుంటారు. క్లోరినేషన్‌ చేయని తాగునీటినే డైరెక్టు బోరు ద్వారా అందిస్తున్నారని, మాకు సురక్షితమైన తాగునీటిని అందించాలని ప్రజలు అనేకసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా ఉంది. వర్షాకాలంలో క్లోరినేషన్‌ చేసిన తాగునీటిని తప్పకుండా అందించాల్సి ఉండగా కనకదుర్గమ్మ కాలనీ ప్రజలు అలాంటి తాగునీటికి నోచుకోలేకపోతున్నారు. జల్‌ జీవన్‌ కింద పైప్‌లైన్‌ వేసినా ఫలితం లేకుండా ఉందని ప్రజలు చెపుతున్నారు.

ఫ కకదుర్గమ్మ కాలనీలో కుళాయులు, తాగునీటి సమ్యలపై పంచాయతీ కార్యదర్శి పుష్పనాధంను వివరణ కోరగా జూలైలో అన్ని కుళాయిలకు ఫ్లాట్‌ఫారంలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణం కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ప్రపోజల్‌ పెట్టారని వివరించారు.

Updated Date - May 31 , 2024 | 12:57 AM