క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:55 AM
క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా అంకింతభావంతో పనిచేస్తున్నామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు.

సౌత్‌జోన్ ఆక్వాటిక్స్ పోటీల ప్రారంభోత్సవంలో శాప్ చైర్మన్ రవినాయుడు
విజయవాడ స్పోర్ట్సు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకు అనుగుణంగా అంకింతభావంతో పనిచేస్తున్నామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ సర్‌విజ్జీ వీఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో 35వ సౌత్‌జోన్ ఆక్వాటిక్స్ చాంపియన్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా అమెచ్యూర్ ఆక్వాటిక్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఆరు రాష్ర్టాల స్విమ్మర్లు పాల్గొన్నారు. నేషనల్ ఆక్వాటిక్స్‌లో సత్తా చాటి పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలను రవినాయుడు అందజేశారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పోటీల్లో 600 మంది స్విమ్మర్లు పాల్గొంటు న్నారని కార్వనిర్వాహక కార్యదర్శి ఐ.రమేష్ తెలిపారు. డీఎ్‌సడీవో ఎస్ ఏ అజీజ్, ఆక్వాటిక్స్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గోవిందరాజు, కార్యదర్శి ఎ.మోహన్ వెంకటరామ్, కృష్ణాజిల్లా ఆక్వాటిక్స్ చైర్మన్ యలమంచిలి వెంకటసురేష్, స్విమ్మింగ్ అసోసియేషన్ చైర్మన్ రమే్‌షజైన్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ కొంగర రవికాంత్, వీఎంసీ స్పోర్ట్సు అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.