Share News

చేపల చెరువులో మాంసం వ్యర్థాల డంపింగ్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:40 AM

వేలేరు గ్రామం మధ్యలో ఉన్న ఊర చెరువులో చేపల పెంపకానికి మాంసం వ్యర్థాల ను మేతగా వేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యర్థాలు తరలిస్తున్న వ్యానును అడ్డగించారు.

 చేపల చెరువులో మాంసం వ్యర్థాల డంపింగ్‌
వ్యర్థాల వ్యాన్‌ను అడ్డుకున్న గ్రామస్థులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, ఏప్రిల్‌ 29 : వేలేరు గ్రామం మధ్యలో ఉన్న ఊర చెరువులో చేపల పెంపకానికి మాంసం వ్యర్థాల ను మేతగా వేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యర్థాలు తరలిస్తున్న వ్యానును అడ్డగించారు. గ్రామం మధ్యలో 65 ఎకరాల విస్తీర్ణం లోని చెరువును చేపలసాగుకు పంచాయతీ వేలం ద్వారా అప్పగించారు. చేపల చెరువు పాడుకున్న నిర్వాహకుడు సోమవారం చేపల మేతకు తీసుకువచ్చిన వ్యర్థాల వ్యానును గ్రామస్థులు అడ్డగించారు. దీంతో నిర్వాహకుడు, వ్యాను డ్రైవరు పరారయ్యారు. వ్యానులో ఉన్న మరొక వ్యక్తిని, వ్యానును స్థానికులు హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 12:40 AM