Share News

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 22 , 2024 | 12:52 AM

ఎన్నికలు, ఫలితాలకు సంబంధించి ఎన్నికల కోడ్‌, 144వ సెక్షన్‌, సీఆర్పీసీ సెక్షన్‌ 30 ఉల్లంఘించి అలర్లు, అలజడులు సృష్టిం చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉయ్యూరు పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

 చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పెదఅవుటపల్లిలో మాట్లాడుతున్న ఆత్కూరు ఎస్సై పైడిబాబు

ఉయ్యూరు, మే 21 : ఎన్నికలు, ఫలితాలకు సంబంధించి ఎన్నికల కోడ్‌, 144వ సెక్షన్‌, సీఆర్పీసీ సెక్షన్‌ 30 ఉల్లంఘించి అలర్లు, అలజడులు సృష్టిం చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉయ్యూరు పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌ హెచ్చరించారు. ఎన్ని కల ఫలితాల దృష్ట్యా ముందస్తు ఆదేశాల్లో భాగం గా మంగళవారం పట్టణంలో పలువురితో సమా వేశం నిర్వహించి ఎన్నికల నియమావళి, నిబంధ నలు ఉల్లంఘిస్తే చట్టపరంగా తీసుకునే చర్యలు తెలిజేశారు. అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, విజయోత్సవర్యాలీలు నిర్వ హించరాదన్నారు. ఉద్ధేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యా ఖ్యలు చేయడం, సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులు ప్రచారం చేయడం నేర మని, ఆ విధంగా ప్రవర్తిచేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఐదుగురిపై రౌడీషీట్‌

ఎన్నికల పోలింగ్‌ సమయంలో చట్టాన్ని అతి క్రమించి గలాటా చేసిన ఐదుగురిపై రౌడీషీట్‌ తె రచినట్టు ఉయ్యూరు పట్టణ ఎస్సై గణేశ్‌కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికా రులపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకపరచి ఎన్నికల నియమా వళి, చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నాయకుడు, రాజులపాటి రామచంద్రరావు మరో నలుగు రిపై చట్టపరంగా చర్యలు తీసు కుని వారిపై రౌడీషీట్లు తెరచి బైండోవర్‌ చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఉంగుటూరు : మండలంలోని ఆత్కూరు, ఉం గుటూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ఎన్ని కల ఫలితాల రోజు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు ఏ.పైడిబాబు, వి.రవి చంద్రకుమార్‌ హెచ్చరించారు. మంగళవారం మండలంలో సమస్యాత్మక గ్రామమైన పెద అవుటపల్లిని ఆత్కూరు ఎస్సై ఏ.పైడిబాబు సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ఆర్‌.రామారావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:52 AM