Share News

సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - May 22 , 2024 | 12:32 AM

విద్యార్థులు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని తమ సత్తాను చాటుకోవాలని గుంటూరు జిల్లా నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌ సూచిం చారు

సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులను అందిపుచ్చుకోవాలి
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తదితరులు

సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులను అందిపుచ్చుకోవాలి

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌

మొగల్రాజపురం, మే 21: విద్యార్థులు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని తమ సత్తాను చాటుకోవాలని గుంటూరు జిల్లా నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి విద్యాసాగర్‌ సూచిం చారు. పీబీ సిద్ధార్థ కళాశాల కంప్యూటర్‌ సైన్సు విభాగం ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మనుగడ సాధించడం ఎలా అనే అంశంపై మూడు రోజుల సదస్సు మంగళవారం నిర్వహిం చారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సా్‌ఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్త కొత్త అప్లికేషన్‌లు, కొత్త పరిజ్ఞానం వస్తోందని, ప్రతి విద్యార్థి అప్‌డేట్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వేమా సోలార్‌ ముంబయి వ్యవస్థాపకుడు ఎంఎస్‌రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కంప్యూటర్‌ డేటా విశ్లేషణ ఎలా ఉపయోగపడుతుందో వివరిం చారు. ఫిక్సటీ ఈడిక్స(హైదరాబాద్‌) కార్యనిర్వ హణాధికారి మూర్తి నంజన్‌, ప్రసాద్‌లు మాట్లాడుతూ సమాచార విశ్లేషణ,రక్షణ రంగంలో ఉపాధి పొందే మార్గాలను సూచించారు. స్టూడెంట్‌ ట్రైబ్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపకులు శ్రీచరణ్‌ లక్కరాజు, సాదృశో టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌) ప్రకాష్‌ కాజా, ఐజీ గ్రూప్‌ మేనేజర్‌ (బెంగళూరు) సంతోషి రాజమనే మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్‌ రంగంలో మార్పులను ఎప్పటికపుడు తెలుసుకుని కొత్త సాంకేతికను నేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్‌ మేకా రమేష్‌ అధ్యక్షత వహించారు. డైరెక్టర్‌ వేమూరి బాబురావు, డీన్‌ రాజేష్‌ తదితరులు మాట్లాడారు. అనుసంధాన కర్తగా కంప్యూటర్‌సైన్సు విభాగం హెడ్‌ డాక్టర్‌ టీఎస్‌ రవికిరణ్‌ వ్యవహరించగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:32 AM