గుడివాడలో మార్పు మొదలైంది
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:28 AM
గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి స్థానిక ప్రజలే తగిన సమాధానం చెబుతున్నారు. ఎక్కడికక్కడ గత పాలకుల నామరూపాలు లేకుండా మార్చేస్తున్నారు. పార్టీలకతీతంగా కొడాలి నానికి రిటర్న్ గిఫ్ట్‌లను యిస్తున్నారు.

గుడివాడ, జూన్ 6 : గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి స్థానిక ప్రజలే తగిన సమాధానం చెబుతున్నారు. ఎక్కడికక్కడ గత పాలకుల నామరూపాలు లేకుండా మార్చేస్తున్నారు. పార్టీలకతీతంగా కొడాలి నానికి రిటర్న్ గిఫ్ట్‌లను యిస్తున్నారు.
ఫ గుడివాడ రాజేంద్రనగర్‌లోని పార్కుకు వైసీపీ ప్రజాప్రతినిధి కొడాలి నాని తన పేరు పెట్టుకున్నాడు. 20ఏళ్లుగా గుడివాడ అభివృద్ధి పట్టని వ్యక్తి పేరు అక్కడ ఉండటాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు పార్కు ముఖద్వారానికి ఉన్న నాని పేరును తొలగించారు.
ఫ స్థానిక మెయిన్ రోడ్డులోని తుమ్మల రాంబ్రహ్మం పార్కులో ఆర్యవైశ్య కళ్యాణమండపానికి ఆనుకుని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కొడాలి నాని చెత్త సేకరణ పాయింట్‌ను పెట్టించారు. ఎన్నికల సమయంలో దానిని మూసివేస్తున్నట్టు నటించి అడ్డుగోడ కట్టించారు. పార్టీలకతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా సదరు సేకరణ పాయింట్ రెండు వైపుల గోడలను ధ్వంసం చేసి తమ అభిప్రాయాన్ని తెలిపారు.
ఫ నందివాడ మండలం అరిపిరాల వద్ద రూ.9కోట్ల వ్యయంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎత్తిపోతల పఽథకాన్ని ప్రారంభించింది. దానికి ఎన్టీఆర్ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే కొడాలి నాని ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్‌పేరుతో తిరిగి ప్రారంభోత్సవం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో స్థానిక రైతులు మూకుమ్మడిగా వైఎస్సార్ పేరును తొలగించి, నాని వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.