Share News

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:38 AM

అంధకారంలో ఉన్న రాష్ర్టానికి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. సూపర్‌ సిక్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మండలంలోని బూతిమిల్లిపాడు, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్ర మాన్ని మంగళవారం నిర్వహించారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు
బూతిమిల్లిపాడులో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీలో యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, ఫిబ్రవరి 6 : అంధకారంలో ఉన్న రాష్ర్టానికి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. సూపర్‌ సిక్‌ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మండలంలోని బూతిమిల్లిపాడు, బుద్ధవరం, అజ్జంపూడి గ్రామాల్లో బాబు ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్ర మాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అందరిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్‌ కోసం తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో సమస్య ల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. నియోజక వర్గంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు. జనసేన నియోజవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వ రరావు, కాజా రామకృష్ణ, ఎర్రబా బు, ప్రసాద్‌, ముద్రబోయిన శ్రీనివాసరావు, మండవ లక్ష్మీ, మేడేపల్లి రమాదేవి, మండవ రమ్యకృష్ణ, వెంకటేశ్వరరావు, శాంతమ్మ, మండవ అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలపై పెనుభారం: బోడె

ఉయ్యూరు : వైసీపీ ప్రభుత్వ పాలనలో చార్జీల పెంపు, నిత్యావసరాల ధరలతో ప్రజలపై పెనుభారం మోపారని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌ ఆరోపించారు. ఉయ్యూరు 6వ వార్డులో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులతో కలసి పర్యటించి చంద్రబాబు నాయు డు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన మహిళాభ్యుదయ పథకా లు, సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో మహిళా సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గుర్నాధరావు, మాజీ చైర్మన్‌ జంపాన పూర్ణచంద్రరావు, కౌన్సిలర్లు సలోమి, పలియాల శ్రీనివాస్‌, టీడీపీ నాయకులు కూనపరెడ్డి వాసు, పండ్రాజు చిరంజీవి, నాగరాజు, సుబ్బారావు, చలపాటి శ్రీను, జయదేవ్‌, అనిల్‌, అయ్యప్ప, తెలుగు యువత నాయ కుడు దండమూడి చౌదరి, జనసేన నాయకులు రాజు, చినకోటయ్య, కార్తీకేయ, ఓంకా ర్‌, మహాలక్ష్మి, అనిత, నాగశ్రీ, విజయ, వినయ్‌కుమార్‌, శివ, రాజు పాల్గొన్నారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

కంకిపాడు : వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి హేమ అన్నారు. మండలంలోని కోలవెన్ను శివారు మాదాసు వారి పాలెంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలకు విసుగెత్తిపోయారని, డబ్బు, అరాచకాల ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా రాకుంటే రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయ కులు తుమ్మలపల్లి హరికృష్ణ, పులి శ్రీనివాసరావు, ఏనుగ జయప్ర కాష్‌, షేక్‌ బాజి, జనసేన పార్టీ నాయకులు అన్నపనేని జానీ, ముప్పా ప్రసాద్‌, కొల్లిపర శివ సతీష్‌, దూడల రాఘవ, పూల వెంకట రామారావు, అయ్యప్ప, శివ గణపతి, రాజేంద్ర, హన్ను, శివ, సతీష్‌, వెంకటేష్‌, రసూల్‌, ఇమ్రాన్‌, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

ఫతెన్నేరులో నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెం టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కుమారుడు వెంకట్‌ రామ్‌తో పాటు యార్లగడ్డ వెంకట్రావు, ఉద్దండి కుటుంబరావు, జుజ్జవరపు నాని, గంగాధర్‌, నాగబాబు, అనిల్‌, లోకాస్‌, యలమంద, మురళి డి. ధనలక్ష్మి ఎన్‌. వెంకటేశ్వ రరావు, రాజశేఖర్‌, జి. తేజ, రెహమాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:38 AM