Share News

మహిళా బ్యాంకు మేనేజరుపై కేసు

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:11 AM

తాను మేనేజరుగా పనిచేసే బ్యాంకులో ఖాతాదారు లోను కోసం పెట్టిన బంగారాన్ని లోను కట్టినా ఇవ్వకుండా మోసం చేసిన ఒక బాం్యకు మేనేజరుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహిళా బ్యాంకు మేనేజరుపై కేసు

పెనమలూరు, జనవరి 31: తాను మేనేజరుగా పనిచేసే బ్యాంకులో ఖాతాదారు లోను కోసం పెట్టిన బంగారాన్ని లోను కట్టినా ఇవ్వకుండా మోసం చేసిన ఒక బాం్యకు మేనేజరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నూజివీడు మం డలం మర్రిబంధం గామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన గంగూరులో ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి పరిచం ఉంది. తాను పనిచేసే బ్యాంకులో యోగేశ్వరరావును ఖాతా తెరవమని ప్రభావతి అడిగారు. దీంతో అతను హైదరాబాద్‌లో ఉన్న తన ఖాతాను గం గూరు బాం్యకుకు బదిలీ చేశాడు. బ్యాంకులో లాకర్‌ ఇప్పించమని అడగ్గా అవసరం లేదని చెప్పింది. తక్కువ వడ్డీకి బంగారంపై లోన్‌ ఇప్పిస్తానని యోగేశ్వరరావుకు చెందిన 380 గ్రాముల బంగా రాన్ని బ్యాంకులో పెట్టి రెండు లక్షల లోన్‌ ఇప్పించారు. తర్వాత తన బాబాయి ద్వారా డబ్బులు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వాత బ్యాం కుకు వచ్చి బంగారం అడుగగా అప్పటికే తన సంతకాలు ఫోర్జరీ చేసి మేనేజరు ప్రభావతి బంగారాన్ని తీసేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమెను నిలదీయగా ఇంటిలో బంగారం ఉందని చెప్పి గంగూరులోని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా.. మోసపోయానని గ్రహించాడు. దీంతో యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - Feb 01 , 2024 | 01:11 AM