కేన్సర్‌పై అవగాహన ర్యాలీ
ABN , Publish Date - Feb 05 , 2024 | 12:27 AM
ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం వలంటీర్లు వందడుగుల రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శరీరంలో మార్పులను గమనించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని, రోజూ వ్యాయామానికి కొంత సమ యం కేటాయించాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్లకార్డులు ప్రదర్శించా రు.
పెనమలూరు, ఫిబ్రవరి 4 : ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం వలంటీర్లు వందడుగుల రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. శరీరంలో మార్పులను గమనించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని, రోజూ వ్యాయామానికి కొంత సమ యం కేటాయించాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్లకార్డులు ప్రదర్శించా రు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి కొల్లా నరేంద్ర పర్యవేక్షించారు.
గన్నవరం : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో అందరూ భాగస్వామ్యం కావాలని గుడ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చిప్పాడ చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా ఆదివారం గుడ్ మార్నింగ్ వాకర్స్ ఆధ్వ ర్యంలో అవగాహన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ, రేపటి కొత్త ప్రపంచం చూడాలంటే నేడు ఆరోగ్యంగా ఉండాలన్నారు. డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ, సమాజంలో నివసించే వారి అలవాట్లను బట్టి మనిషి సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉంటుందన్నారు. శ్రీనివాసరావు, విక్టర్‌బాబు, సుబ్బారావు, సత్యనారాయణ, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.